నేను నా స్నేహితురాలు ఒక రోజున, దేవుడు మా జీవితాల్లోకి అనుమతించిన కొన్ని తలక్రిందులుగా ఉన్న సమయాల గురించి, అప్పుడు దేవుడు ఎందుకు ఇలా నిరాశ పరిచారు అనే అయోమయంలో ఉన్న సమయాల గురించి మాట్లాడుకుంటున్నాం.
అప్పుడు మొదటలో దేవుణ్ణి మరీ ఎక్కువగా అంచనా వేసేశామా అని అలోచించి విశ్వాసంలో వంగిపోయినట్టు అనిపించింది. కాని చివరికి, కాదు మనం దేవుణ్ణి తక్కువగా అంచనా వేసాము అని తెలుసుకోని విశ్వాసంలో స్థిరపరచబడ్డాం.
మనం తరుచు దేవుణ్ణి చాలా తక్కువగా అంచనా వేస్తాం.
అందుకే దేవుడు మనకు యోబు గ్రంధాన్ని ఇచ్చారు.
యోబు, తన చుట్టూ ప్రపంచం కుప్పకూలిపోవడానికి దేవుడు అనుమతించినప్పుడు, " నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక" (యోబు 1:21) అని ప్రకటించాడు.
అయినప్పటికీ, పరిస్థితులు ఇంకా క్షీణించినప్పుడు, యోబు కూడా దేవుని ప్రేమను, జ్ఞానాన్ని తక్కువగా అంచనా వేయడం ప్రారంభించాడు. కనుక దేవుడు మన అందరికి కూడా అవసరమైన జవాబు యోబుకు ఇచ్చారు - ఒక దృఢమైన నిశ్చయత : మనం సర్వజ్ఞానులం కాదు, అన్నింటింకి జవాబులు మనకు తెలీవు, కాని దేవుడు అలా కాదు. అదీ కాకుండా, ఆయన గొప్ప ప్రేమ కనికరాలతో నిండియున్న దేవుడు.
నీవు ఏదైనా కఠినమైన, అన్యాయంగా అనిపించే పోరాటాల్లో ఉన్నావా? ఐతే యోబు గ్రంధం లోని ఆఖరి అధ్యాయాలు (యోబు 38-42:6) చదివి ఆ దృఢమైన నిశ్చయతని గుర్తుంచుకోవాలని నేను నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాను. దేవుడు మన జీవితంలో దేనిని అనుమతించినా, అది ఎదో ఒక మంచికోసమే అయన ఉపయోగిస్తారు.
The Unshakable Bottom Line