"సమయం మించిపోయిందని" దేవుణ్ణి చెప్పనీయకు

 

ఈ పాత నిబంధనలో ఉన్న కథ, మనం దేవుని సహనాన్ని పరీక్షించి, నష్టాన్ని వెనక్కి తీసుకోలేని పరిస్థితికి రాకూడదని ముఖ్యమైన హెచ్చరికను అందిస్తుంది!!

కొన్నిసార్లు "సమయం మించిపోయిందని" దేవుడు చెప్తారు.


సంఖ్యాకాండము 13,14 లో దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఆయన ఇస్తారు అని నమ్మడానికి నిరాకరించారు పదిమంది ఇశ్రాయేలు నాయకులు. వారు తిరుగుబాటును ప్రేరేపించారు, ఐగుప్తు కోసం తపించారు, మోషే మీద రాళ్లు రువ్వాలని మాట్లాడారు.


దేవుని యొక్క విశ్వాస్యత నిరూపణను సమృద్ధిగా చూసి కూడా ఆయనను నమ్మడానికి, విధేయత చూపడానికి వారు నిరాకరించారు.


యెహోవా ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారి మధ్యను చేసిన సూచకక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక యుందురు? (సంఖ్యాకాండము 14:11)


యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, దోషమును అతిక్రమమును పరిహరించువాడు (సంఖ్యాకాండము 14:18). కాని ఆయన అడిగినది మొండిగా మనం చేయకపోతే, ఆయన ఆశీర్వాదములను పోగొట్టుకుంటాం.


ఆ పదిమంది విశ్వాసం లేనివారు వారి అవిశ్వాసం వలన చనిపోయారు. అయినా మిగిలిన వారు పశ్చాతాప పడటానికి నిరాకరించారు. దేవుని సహాయం లేకుండానే భూమిని స్వాధీనపరుచుకోవాలని ప్రయత్నించారు గాని వారు పూర్తి ఓటమిని చూడాల్సివచ్చింది.


ఈ పోగొట్టుకున్న వాగ్దానాల కధ ఆధారంగా హెబ్రీ 3 ఈ మాటలు చెబుతుంది "పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. (హెబ్రీయులకు 3:14)


దేవుని సహనాన్ని పరీక్షించొద్దు. "సమయం మించిపోకముందే" ఆయన యందు విశ్వాసం ఉంచి, విధేయత చూపుదాం, ఆయన మనకు ఉంచిన ప్రతీ ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం!!


Don't Let God Say, “It's too late.”


ఈ పాత నిబంధనలో ఉన్న కథ, మనం దేవుని సహనాన్ని పరీక్షించి, నష్టాన్ని వెనక్కి తీసుకోలేని పరిస్థితికి రాకూడదని ముఖ్యమైన హెచ్చరికను అందిస్తుంది!!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.