రఫిలేష్యా ఆసియా లో దొరికే ఒక పరాన్నజీవి వంటి మొక్క.
దానికి కాండము, ఆకులు, వేర్లు ఏమీ ఉండవు, కాని వాటంతట అవే తీగల్లోకి దూరిపోయి, అయిదు రేఖల పువ్వులా పెరుగుతుంది. దీనికి కుళ్ళిపోయిన మాంసం వంటి వాసన ఉంటుంది.
చేదుకు ఇదొక గొప్ప ఉదాహరణ. చేదు ఒక పరాన్నజీవి వంటిది గనుక దీనికి ప్రవేశించడానికి మనిషి కావాలి. ఒక్కసారి అది ఒక వ్యక్తిలోకి దూరి, ఆ వ్యక్తి యొక్క ఆత్మకు జతబడితే, తన జీవితంలో ప్రతీదీ కంపుకొట్టడం ప్రారంభం అవుతుంది.
కాని చేదు అనేది రఫిలేష్యా కంటే కొంచెం భిన్నమైనది ఎందుకంటే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిన వెంటనే చేదు మాయమైపోతుంది.
కీడుకు ప్రతి కీడు చేసి జయించమని లోకం చెబుతుంది. కాని "కీడుకు ప్రతి కీడు చేయకుండా, కీడును మేలుతో జయించమని" దేవుడు చెబుతున్నాడు (రోమా 12:17-21).
తగిన సమయంలో, ప్రతీ మానవుని హృదయంలో ఆయన గురించి ఉన్న లోపం లేని జ్ఞానాన్ని అనుసరించి, దేవుడు మన శత్రువులను తప్పక శిక్షిస్తాడు.
కీడును మేలుతో జయించడం అంత సులభం కాదు, కాని మనకు క్రీస్తు యొక్క శక్తి ఉంది గనుక మనం చేయగలం (ఫిలిప్పీ 4:13). అంతేకాదు, దేవున్ని కృతజ్ఞత హృదయంతో మనం వెతికితే, మన జ్ఞానానికి మించిన సమాధానం ఇస్తాననే ఆయన యొక్క అద్భుతమైన నిశ్చయత కూడా మనకుంది (ఫిలిప్పీ 4:4-7).
Sin Looks Attractive But It Stinks - Like Rafflesia


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.