నీతిమంతులు ఎప్పటికీ ప్రసిద్ధి చెందలేదు.
స్వనీతిపరులైన మత నాయకులతో తప్ప, మిగతా అందరితో యేసు ప్రసిద్ధి చెందారు అని కొందరు అనుకుంటారు.
యేసు మత నాయకులతో ద్వేషించబడ్డారు అనేది వాస్తవమే (మత్తయి 26:3,4), కాని, ఆయన తృణీకరింపబడ్డారు, వెక్కిరింపబడ్డారు, ద్వేషింపబడ్డారు ఈ క్రింది వారి ద్వారా కూడా :
1. ఆయన కుటుంబం (యోహాను 7:2-5)
2. ఆయన శిష్యులు (యోహాను 6:53-66)
3. ఆయన ఊరివారు (మత్తయి 13:54-57)
4. సాధారణ జనాలు (యోహాను 7:7)
ఆయన చెప్పేది వినాలని చాలా మంది పెద్ద గుంపులుగా వచ్చినా, వారు వచ్చింది ఆహరం కోసమే కాని, ఆయనపై విశ్వాసంతో కాదు (యోహాను 6:22-26).
లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోకసంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. (యోహాను 15:18,19)
పశ్చాతాపం, త్రుణీకరించుకోవడం, పరిశుద్ధత, నీతి, వీటి గురించి ఏమీ చెప్పకుండా, కేవలం కథలో సగభాగమైన దేవుని ప్రేమ గురించి మాత్రమే ఇతరులకు చెప్పడం చాలా సులువు. ఇవన్నీ యేసు బోధించినప్పుడు ఎలాగైతే ప్రసిద్ధి కాలేదో, ఈరోజుల్లో కూడా ఇవి ప్రసిద్ధి కావు!
ప్రసిద్ధి చెందాలి అనే ఆలోచనల నుండి మనస్సు తిప్పుకొని, యేసులానే మనం కూడా పూర్తి సువార్తను కృపాసహితంగా, ప్రేమతో, ధైర్యంగా ప్రకటించాలని ప్రార్ధిద్దాం (మత్తయి 10:22).
Righteousness Has Never Been Popular


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.