క్రైస్తవులు మంటి ఘటాలు - శారీరికంగా, మానసికంగా బలహీనులం, మంటి నుండి చేయబడినవాళ్ళం (ఆదికాండము 2:7) (1)
కాని మనం గొప్ప నిధిని (ఐశ్వర్యం) మోసేవాళ్ళం : ఆ నిధి దేవుని ఆత్మ.
అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. (2 కొరింథీయులకు 4:7)
అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. (2 కొరింథీయులకు 4:5)
ఈ ఐశ్వర్యం మనలో ఉంది కనుక మనం శ్రమపడేవారం, అపాయంలో ఉన్నవారం, తరుమబడుచున్నవారం, పడద్రోయబడుచున్నవారం కాని మనం ఇరుకింపబడం, ఉపాయములేనివారముకాము, దిక్కులేనివారముకాము, నశించువారముకాము.
మనలో ఉండే దేవుని ఆత్మ:
1. పాపం నుండి తిరిగేలాగా తప్పు ఒప్పులను బోధిస్తుంది (ఎఫెసీయులకు 5:8-16; రోమా 8:12,13).
2. క్రీస్తును ప్రకటించడానికి శక్తినిస్తుంది (అపో. కార్యములు 1:8).
3. దేవుని ప్రేమ గురించి నిశ్చయతనిస్తూ, ఇతరులను ప్రేమించడానికి సహాయం చేస్తుంది (రోమా 5:5; ఫిలిప్పీ 2:1-4).
4. ఆత్మసంబంధమైన యుద్ధానికి సిద్దపరుస్తుంది (ఎఫెసీయులకు 6:10-18).
5. దైవిక గుణాలను మనలో ఉత్పత్తి చేస్తుంది (గలతీ 5:22,23).
దేవుని ఆత్మ బలహీనమైన, అసంపూర్ణమైన మనుషులను ఉపయోగించుకుంటూ గొప్ప ఐశ్వర్యంతో సమానమైన ఆయన ప్రణాళికలను నెరవేరుస్తుంది (2 తిమోతి 2:20-21; ఎఫెసీయులకు 2:10) (2)
--------------
(1) దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. (ఆదికాండము 2:7)
పాతకాలంలో ధనవంతులు వారి ధనాన్ని మామూలు మంటి ఘటాల్లో దాచేవారు. బహుశా పౌలు ఈ అలంకారాన్ని వాడినప్పుడు ఆ విషయాన్నే అలోచించి ఉండొచ్చు.
(2) గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్రపరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడువాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయైయుండును. (2 తిమోతికి 2 : 20, 21)
మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. (ఎఫెసీయులకు 2:10)
ఫిలిప్పీ 2:12-13 కూడా చూడండి!


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.