యోనాతాను దావీదు యొక్క హృదయాలు కలిసిపోయాయి అనేది అతిశయోక్తి కాదు.
1. యోనాతాను దావీదు ఇద్దరూ దేవుడిచ్చిన అధికారాన్ని ఎంతో గౌరవించారు :
యోనాతాను తన తండ్రి అయిన సౌలుకు మంచి బుద్ధి లేకపోయినా ఆయనను గౌరవించాడు* (ఎఫెసీయులకు 6:2-3)
దావీదు కూడా దేవుడు నియమించిన రాజుగా రాజైన సౌలును గౌరవించాడు (రోమీయులకు 13:1-2). సౌలు దావీదుకు ఎంత ద్రోహం చేసినా, చివరకు చంపాలని ప్రయత్నించినా కూడా దావీదు మాత్రం సౌలును అవమానించాడానికి గాని హాని చేయడానికి గాని నిరాకరించాడు (1 సమూయేలు 24:1-13).
2. యోనాతాను దావీదు ఇద్దరూ దేవుడు అసాధ్యాలను సాధ్యం చేయగలిగే సమర్ధుడు అని దేవుని సామర్ధ్యన్ని గౌరవించారు:
యోనాతాను, తన ఆయుధములు మోసేవాడు ఫిలిష్తీయుల సైన్యసమూహన్ని జయించకముందు "యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా" అని చెప్పాడు (1 సమూయేలు 14:6)
దావీదు కూడా గొల్యాతును చంపక ముందు "నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను... యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. (1సమూయేలు 17:45-47)
ఈ లక్షణాలు వేరేవేరుగా ఉన్నట్టుగా అనిపించినా, దేవునిపై ఆయన వాక్యం పై లోతైన గౌరవం నమ్మకం వారిద్దరిలో స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి విషయాలలో నీకు ఏ విధమైన విశ్వాసం ఉంది?
-------------------
*యోనాతాను యొక్క జీవితాన్ని చదివితే యోనాతాను తన తండ్రి చేసే చెడు నిర్ణయాలను సమర్ధించలేదు, అంతేకాకుండా దావీదును చంపే ప్రయత్నాలు చేసేటప్పుడు యోనాతాను రక్షించాడు. కాని తన తండ్రితో పాటు తన మరణం వరకు నమ్మకంగా ఉండి పోరాడిన వ్యక్తి యోనాతాను.
Kindred Spirits -Jonathan and David's Friendship