గుడారం నుండి పరలోకానికి

నువ్వు నిరాశలో ఉంటే, ఈరోజు వాక్యధ్యానం నువ్వు ఎటు ప్రయాణిస్తున్నావో నీకు గుర్తు చేసి నీకు స్ఫూర్తినిస్తుంది!


ఒక అద్భుతమైన, విశాలమైన ఇంటికి మారే ముందు, ఒక అసౌకర్యవంతమైన గుడారంలో నువ్వు నీ కుటుంబం కొన్ని నెలలు నివసించాలనుకో.. ఊహించు..


అసౌకర్యాలు గురించి ఫిర్యాదు చేయాలని అనిపించినప్పుడెల్లా, రాబోయేది గుర్తుచేసుకుంటావు కదా. ఇంక కొత్తింటికి మారిన తరువాత అనుభవించిన ఆ కొద్ది నెలల అసౌకర్యం అసలు గుర్తే రాదు కదా.


మనం ఎప్పుడైతే నిరాశలు, కఠిన పరిస్థితులు, దుఃఖం, మరణాలు, అనారోగ్యం వంటివి అనుభవిస్తామో, ఈ పై విధంగా సంభాళించుకోవడం బైబిల్ చెప్పే పద్ధతి.


మనం క్రీస్తు ప్రభువును మన రక్షకునిగా చేసుకుంటే, సమస్యల మధ్యలో నుండి, పరలోకంలో మనం ఉండబోయే ఆ నిత్యత్వంతో పోల్చుకుంటే, భూమిపై మనం జీవించే జీవితం చాలా స్వల్పమైనదే అని మనకు మనమే గుర్తు చేసుకోవాలి.


అలాగని నొప్పి, బాధ, భయం, నిరాశ మనం నివసించే ఈ 'గుడారపు జీవితానికి' ఉండవని కాదు. కాని ఎప్పుడైతే భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవునిపై మనం నిరీక్షణ కలిగి ఉంటామో, నిత్యత్వమే లోపం లేనిదని మనకి మనం గుర్తుచేసుకుంటామో, అప్పుడే మన ఆత్మకి నెమ్మది కలుగుతుంది.. :


భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము. (2 కొరింథీయులకు 5:1)


ఆ సమయం వచ్చే వరకు దేవుని వద్దే విశ్రాంతి వెదకాలి:


ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. (మత్తయి 11:28-30)


From Tent to Paradise


నువ్వు నిరాశలో ఉంటే, ఈరోజు వాక్యధ్యానం నువ్వు ఎటు ప్రయాణిస్తున్నావో నీకు గుర్తు చేసి నీకు స్ఫూర్తినిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.