తన ఇంట్లో మెట్ల కింద వాడకుండా ఉన్న ఒక చోటు ఉందని గమనించిన మార్క్ అనే ఇంజనీర్, తన పిల్లల కోసం ఆ చోటును ఒక రహస్య గదిగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. దానిలోకి వెళ్లాలంటే వంటగది సామాలు అమర్చే ఒక చిన్న అల్మారా దాటి వెళ్ళాలి.. వారి తండ్రి కూడా వారితో అందులో ఆడుకోగలిగే అంత పెద్దదే ఆ రహస్య గది.
ఇది ఎంత ఆహ్లాదాన్నిస్తుందో కదా? ఆ గది ఆడుకునే స్థలం మాత్రమే కాదు, అక్రమంగా చొరబడే వారి నుండి దాక్కునే ఒక సురక్షితమైన స్థలం కూడా.
నాకు కూడా ఒక పుస్తకాలు పెట్టుకునే అల్మారా వెనుక లేక ఎవ్వరికి కనబడని డోర్ వెనుక నుంచి వెళ్ళగలిగే ఒక రహస్య గది కావాలనే కోరిక ఉండేది. ఈ ఆలోచన ఎందుకు నన్నంత ఆకర్శించిందో నాకు తెలీదు. బహుశా లోకం పెట్టే ఒత్తిడులు నుండి కొన్నిసార్లు దాక్కోవాలి అని అనిపించడం వలన కావొచ్చు.
ఈ మధ్య కొన్ని భారమైన సమస్యలతో నేను కష్టపడుతుంటే, నా స్నేహితురాలు నా కోసం ప్రార్ధిస్తున్నప్పుడు, దేవుడు తనకు కీర్తన 32:7 గుర్తుచేసాడని నాకు ఉత్తరం వ్రాసింది.
• నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు (కీర్తనలు 32:7)
ఒక స్నేహితురాలు లేఖనాలతో కలిపి ఉత్తరం రాయడం నాకు చాలా ప్రత్యేకమైన విషయం. ఆరోజు దేవుడు నాకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేయడానికి ఆమెను వాడుకున్నాడు : జీవితం బాధిస్తున్నప్పుడు, మనం పగిలిపోయి గాయాలపాలైనప్పుడు, మనం వెళ్ళడానికి మనకొక సురక్షితమైన స్థలం ఉంది.. ఆ స్థలంలో, మనలను క్రుంగతీసే బాధాకరమైన ఆలోచనల బరువును దించివేసి, మనలను కాపాడే మన ప్రభువు యొక్క ప్రేమలో సేదదీర్చుకుందాం. నా పరలోకపు తండ్రి, నా కోసం, ఆయన ప్రేమలో, నేను సేదదీరే, నాకు భద్రతనిచ్చే, ఒక "రహస్య గదిని" చేర్చాలనే తలంపు కలిగి ఉన్నందుకు నేనెంతో కృతఙ్నురాలిని.
• నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు (కీర్తనలు 31:19,20)


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.