నేనెందుకు దొంగిలించను

ఈరోజు వాక్యధ్యానం నేనెందుకు దొంగిలించనో వివరిస్తుంది. నువ్వెందుకు దొంగిలించవు? లేదా దొంగిలిస్తావా?


నా మనస్సాక్షి గనుక నన్ను గద్దించకపోతే, బహుశా నేను ఈ ఎనిమిదవ ఆజ్ఞను మీరి, దొంగిలించేదాన్నేమో (నిర్గమ కాండము 20:15).


అలాగని షాపులను లేక బ్యాంకులను కొల్లగొట్టడం కాదుగాని చిల్లరలో ఎక్కువ వచ్చింది ఇవ్వకుండా నా జేబులో పెట్టుకోవడం, హోటల్లో ఆహారం పెట్టిన వెయిటర్ డిసెర్ట్కు డబ్బులు వేయడం మర్చిపోతే గుర్తుచేయకపోవడం, కాపీ రైటింగ్ ఆర్టికల్స్ వాడుకోవటం, టాక్స్లను తప్పించుకోవడం వంటివి..


కాని యేసయ్యను నేను ప్రేమిస్తాను గనుక నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. ఇటువంటి పనులు నేను చేయలేను ఎందుకంటే అబద్దం ఆడటం నా రక్షకుని గుణం కాదు, ఆయన్ని వెంబడించడమే నా లక్ష్యం గనుక (ఎఫెస్సీ 5:8-11).


దేవుని ఆజ్ఞలను మీరినప్పుడు నేరం చేశామనే గద్దింపు మనలో కలగటం సహజమే ఎందుకంటే తప్పు ఒప్పులు గురించిన స్పృహ మన హృదయాలపై వ్రాసి ఉన్నాయి గనుక (రోమా 2:15). ఇంక మనం క్రీస్తును అంగీకరించిన తరువాత, క్రీస్తు మనకు నూతన హృదయాన్ని ఇస్తారు, అప్పుడు ఇంకా పాపానికి ఎక్కువ సున్నితులం అవుతాం. మనకు పాపం చేయడం అంటేనే ఇష్టం ఉండదు, ఎందుకంటే మనం క్రీస్తును ప్రేమిస్తున్నాం గనుక (1యోహాను 5:3).


నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది అనేది నాకెంతో సంతోషాన్నిస్తుంది. ఎందుకంటే క్రీస్తు ఆత్మ నాలో ఉందనడానికి అదొక సూచన. నా మనస్సాక్షి గద్దింపును నేను వినడం మానేస్తే నెమ్మదిగా దాని శక్తిని కోల్పోతాం. ఎక్కువ కాలం గనుక నిర్లక్ష్యం చేస్తే, పాపానికి సున్నితత్వాన్ని పూర్తిగా కోల్పోతాం (1 తిమోతి 4:2).


గనుక ఇచ్చిన మనస్సాక్షి గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి కొంత సమయం తీసుకో. ఎందుకంటే మన చేతులు కాలకుండా ఉండటానికి దేవుడు పెట్టిన ఒక సంరక్షణే ఈ మనస్సాక్షి అనే ఆశీర్వాదం.


Why I Don't Steal


ఈరోజు వాక్యధ్యానం నేనెందుకు దొంగిలించనో వివరిస్తుంది. నువ్వెందుకు దొంగిలించవు? లేదా దొంగిలిస్తావా?


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.