• అలెగ్జాండర్ గ్రహంబెల్ టెలిఫోన్ ను కనుక్కున్న తండ్రి
• థామస్ ఎడిసన్ లైట్ బల్బ్ ను కనుక్కున్న తండ్రి
• బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ను కనుక్కున్న తండ్రి• మార్క్ జుకెర్బెర్గ్ ఫేసుబుక్ ను కనుక్కున్న తండ్రి
తండ్రి అంటే దానర్ధం పలానావాటిని కనిపెట్టారని. వాటిని గూర్చి ఆలోచించారు, డిజైన్ చేశారు, అందుబాటులోకి తెచ్చిన వారు.
ఇప్పుడు దీన్ని చదవడానికి ఆయత్తపడు:
దేవుడు కనికరముచూపు తండ్రి (2 కొరింధీ 1:3-4).
దేవుడు కనికరముచూపు తండ్రి (2 కొరింధీ 1:3-4).
దేవుడు కేవలం కనికరాన్ని కనిపెట్టినవాడు కాదు - ఆయనే దానికి మూలం, కనికరాన్ని చూపే వాడు. ఆయన ఏమై ఉన్నాడో, ఈ గుణం అందులో భాగం అన్నమాట.
ఆయన ఏమై ఉన్నాడో ఆ పూర్తి పేరు ఈ వచనంలో ఇలా వ్రాసి ఉంది: "కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు".
సమస్తమైన ఆదరణ.
నీవు ఇక భరించలేను అనే ఏదైనా స్థితిలో ఉన్నావా?
నీ పరిస్థితి ఏదైనా కావొచ్చు, నీ ప్రభువు దగ్గరకు ప్రార్ధనతో, విజ్ఞాపనతో, పశ్చాతాపంతో, కన్నీటితో, వేదనతో నీవు వెళ్ళినప్పుడు, ఒకటి గుర్తుపెట్టుకో. నీవు వెళ్తున్నది కేవలం కనికరాన్ని కనిపెట్టిన వాని దగ్గరకే కాదు, కనికరం యొక్క మూలమైన, కనికరము చూపు తండ్రి యొద్దకు వెళ్తున్నావని మర్చిపోకు.
సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు నిన్ను ప్రోత్సాహించడానికి ఇచ్చిన ఈ క్రింది వచనాలు ఎందుకు చదవకూడదు: కీర్తనలు 103:13; యెషయా 30:18; యెషయా 41:10; యెషయా 49:13; యెషయా 54:10; యాకోబు 5:11; 2 కొరింధీ 1:3; హెబ్రీ 13:5.
----------------------
*ఎడిసన్ మొదటి లైట్ బల్బ్ ను కనిపెట్టిన వాడు కాదు గాని వ్యాపారానికి మొదటగా అందుబాటులోకి లైట్ బల్బ్ ను అందించిన వ్యక్తి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.