స్త్రీ వాదాన్ని చెప్పే వేదాంతులు దేవుణ్ణి ఒక పురుషునిగానే కాదు, స్త్రీ గా కూడా వర్ణించాలని పట్టుబడతారు.
వారు ప్రాముఖ్యంగా ఈ మూడు సత్యాలను ఎత్తిచూపుతారు:
2. కొన్ని వాక్యభాగాలలో స్త్రీ లక్షణాలతో దేవుని వర్ణణ ఉంది అని (మత్తయి 23:37) (1)
3. స్త్రీ పురుషులు ఇద్దరూ దేవుని పోలికలోనే సృష్టింపబడ్డారు.
ఇవన్నీ నిజాలే. కాని మనం దేవుణ్ణి దేవునిలా ఉండనిచ్చే వారమైతే, ఆయన తనను తాను ఏవిధంగా వర్ణించుకున్నారో దానిని విశ్వసించేవారమై ఉండాలి.
లేఖనాలను వాటి మూల భాషలో చూసినప్పుడు, దేవుడు తనను తాను ఒక పురుషునిగా వర్ణించుకోవడాన్ని ఎంచుకున్నట్టు మనం స్పష్టంగా చూడగలం - ఒక తండ్రిగా, కుమారునిగా, ఆయనగా, అతనుగా. తనను తాను స్త్రీ పదాలతో వర్ణించుకోవడం ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ జరగలేదు - ఒక తల్లిగా, కూతురుగా, ఆమె, ఇలా ఎన్నడూ లేదు.
'ఆత్మకు' గ్రీకులో వాడిన పదం 'న్యూమా'. ఈ పదం పురుషునికి గాని స్త్రీ కి గాని సంబంధించినది కాదు, అయినప్పటికీ ఆత్మ అనే పదం లేఖనాలలో ఎక్కడ వాడినా, "ఆయన" గానే దానిని వాడటం జరిగింది. మీరు వాక్యంలో ఎక్కడైనా దీనిని గమనించవచ్చు.
పరిశుద్ధ గ్రంధాన్ని దేవుని వాక్యంగా గనుక మనం విశ్వాసిస్తే, దేవుడు తనను తాను ఖచ్చితమైన, అర్ధమయ్యే నామాలతో, లింగంతో వర్ణించుకున్నారని, అందులో ఏ సందేహం లేదని కూడా విశ్వాసించాలి (కీర్తన 18:30; సామెతలు 30:5; 2 తిమోతి 3:16).
మనం గనుక దేవుణ్ణి ఒక స్త్రీ గా ఇతరులకు పరిచయం చేసినా, లేక ఆయనను "తల్లి ఐన దేవుడు" అని పిలిచినా, మనం దేవుని జ్ఞానాన్ని, బైబిల్ సత్యాన్ని నమ్మనట్టే.
దయచేసి దేవుణ్ణి దేవునిగానే ఉండనిద్దాం.
----------------------
----------------------
(1) ఈ వాక్యభాగంలో యెరూషలేము సంతానాన్ని కోడి తన రెక్కల క్రిందకు తెచ్చినట్టుగా తేవడం అనే యేసు యొక్క వేదనను మనం చూస్తాం. ఇది ఒక ఉపమానం లేక అలంకారంగా ఉపయోగించబడింది, ఒక పోలికను వివరించడానికి. దీని అర్ధం యేసు ఒక పక్షి లేక ఒక స్త్రీ అని అసలు కాదు. ఉదాహరణకు పౌలు థెస్సలోనికలో ఉన్నవారి విషయంలో తనను వారికి ఒక తల్లిలాగా వర్ణించడం 1 థెస్సలోనీకయులకు 2:7 లో చూస్తాం, అలా చెప్పినంతమాత్రనా పౌలు పురుషుడు కాదు అనే సందేహం ఎవరికీ లేదు కదా!
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.