తాను దాచుకోలేనిది ఇచ్చివేసిన వ్యక్తి వెర్రివాడేమీ కాదు!

అయిదు తప్పుడు విధాలుగా మనం బుద్దిహీనతను పండుగ చేసుకుంటాం. వీటిని, అలానే చాలా మందికి తెలిసిన ఒక మిషనరీ కొటేషన్ ను ఈరోజు వాక్యధ్యానంలో నేర్చుకుందాం!


ఏప్రిల్ ఫూల్స్ డే చర్చికి సంబంధించిన ఒక సెలవు దినం కాదు కాని దేవుడు బుద్దిహీనుల గురించి చాలా చెప్పారు.


మనం బుద్ధిహీనతను పండగ చేసుకుంటాం: ఎలాగంటే -


1. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు.

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. (సామెతలు 1:7)


2. దిద్దుబాటును తిరస్కరించినప్పుడు.

బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. (సామెతలు 23:9, 17:10)


3. మన మీద మనం నమ్మకం పెట్టుకున్నప్పుడు.

తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు.. (సామెతలు 28:26)


4. మనకన్నీ తెలుసు అని అనుకున్నప్పుడు.

బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. (సామెతలు 18:1,2)


5. మనం స్వనియంత్రణ కోల్పోయినప్పుడు.


బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును. (సామెతలు 14:16)


బుద్ధిహీనులు అన్నింటికంటే తీవ్రమైన బాధను కలిగించే ఒక పండుగ చేసుకుంటారు: అది - దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. (కీర్తనలు 14:1)


హతసాక్షిగా మారిన మిషనరీ జిమ్ ఎలియట్ తన అభిప్రాయాన్ని కొటేషన్ రూపంలో సరిగ్గానే చెప్పారు - "తాను దాచుకోలేనిది ఇచ్చివేసిన వ్యక్తి వెర్రివాడేమీ కాదు" అని.


He Is No Fool Who Gives What He Cannot Keep


అయిదు తప్పుడు విధాలుగా మనం బుద్దిహీనతను పండుగ చేసుకుంటాం. వీటిని, అలానే చాలా మందికి తెలిసిన ఒక మిషనరీ కొటేషన్ ను ఈరోజు వాక్యధ్యానంలో నేర్చుకుందాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.