మన విశ్వాసానికి అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే దేవుని వాక్యం పై మనకున్న నమ్మకమే. దేవుని వాక్యమే మనలో యదార్ధమైన విశ్వాశాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు, దానిని కాపాడుతుంది కూడా. (క్రింద ఉన్న వాక్యభాగాలను గమనించండి)
దీనికి ఇంకో కోణం ఏమిటంటే, క్రీస్తుపై విశ్వాసాన్ని కోల్పోయి, ఆయనను విడిచి పెట్టిన వారి కధలను చూస్తే, అలా వారు చేయడానికి అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే దేవుని వాక్యం పై వారికి గౌరవం లేకపోవడమే.
దేవుని వాక్యం నిజంగా దేవుని వాక్యం కాదు అని ఎవరైనా తీర్మానించుకుంటే, అంతకంటే బాధాకరమైనది ఇంకోటి లేదని నీకు అర్థమైందా? అంటే అన్నింటికంటే గొప్ప తెలివి, జ్ఞానం ఒక పరిమితిగల మనిషికి ఉందని నమ్మడమే.
అలాంటి వారు ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది సత్యం, ఏది అసత్యం, జీవితం అంటే అర్ధం, మరణం తరువాత జీవితం ఎంతవరకు సాధ్యం అనే వాటి గురించి పరిమితి జ్ఞానం గల వారిపై వారు ఆధారపడాల్సిందే.
వాక్యంలో కొన్ని ఎన్నుకోని వాటినే నమ్మడం, ఇంకొన్నింటిని తృణీకరించడం చేసినా, దీని అర్ధం మనిషి యొక్క తర్కం పైనే వారు ఆధారపడుతున్నారని.
ఇది చాలా భయానకం...
ఎవరైనా బైబిల్ లో ఉన్న సజీవమైన, నిజమైన దేవుణ్ణి తృణీకరిస్తే, వారికి నచ్చిన స్వరూపంలో పోలికలో వారే వారి సొంత దేవుణ్ణి తయారు చేసుకున్నారని అర్ధం.
మనిషి తయారు చేసిన దేవుడా లేక బైబిల్ చెబుతున్న దేవుడా - ఏ దేవుడిపై నీ నిత్యత్వం ఆధారపడి ఉంది? అది అపాయంలో ఉందేమో..
🌟 వాక్యం గురించి వాక్యమే వివరించిన వాక్యభాగాలు:
• దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము. (సామెతలు 30:5)
• గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. (యెషయా 40:8)
• దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము తన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము. (కీర్తనలు 18:30)
• ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. (హెబ్రీయులకు 4:12)
• సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి. (కొలొస్సయులకు 3:16)
• మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును (మత్తయి 4:4)
• ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. (మత్తయి 24:35)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.