మన ప్రభువు యొక్క నమ్మకమైన స్నేహం

ఏ సంబంధమైనా, స్నేహితులు లేక ప్రియమైన వారు అని అనిపించడం బదులు, ఒక పనిగా నీకు  అనిపించిందా? ఈరోజు వాక్యధ్యానం ప్రభువుతో మనకున్న సంబంధాన్ని లోతుగా పరిశీలించుకోవడానికి ప్రోత్సాహిస్తుంది!


నీవు ఏ సంబంధంలో అయినా నమ్మకంగా ఉన్నావా?


స్నేహితురాలను కలవడానికి నీ సమయాన్ని సర్దుకోని మరీ కాఫీకి పిలిస్తే, ఆ సమయం ఆమెకు కొంచెం ఇబ్బందిగా ఉందని ఆఖరి నిమిషంలో కలవడం మానేసిందనుకో...


ఆమెకు ఏదైనా అవసరం పడితే అపుడే నీ సహాయం అడిగి, నీకు అవసరం వచ్చినప్పుడు ఆమె సహాయం చేయడానికి బిజీగా ఉందనుకో..   గంటల కొద్దీ ఆమె నీతో మాట్లాడుతుంది, కాని నువ్వు మాట్లాడటం మొదలుపెడితే వాచ్ లో టైం చూసుకుంటుందనుకో... ఇంక ఆమెతో సంబంధం నీకు స్నేహంగా కంటే ఒక పనిగా, బరువుగా అనిపిస్తుంది కదా.


అలాంటి వ్యక్తులతో ఉండటం అంత సరదాగా అనిపించదు, కదా?


కాని నేను నా దేవునితో అలానే ప్రవర్తిస్తుంటాను. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను (హెబ్రీయులకు 13:5) అన్న ఆయన వాగ్దానం నా ఎదురుగా ఉన్నప్పటికీ కూడా.


ఈరోజు మన నిజస్నేహితుడైన ప్రభువుతో ఆసక్తి కలిగి సన్నిహితమైన సంబంధంలో ఉండటానికి ఒక తీర్మానం చేసుకుందామా? నీకున్న చిన్న చిన్న ఇబ్బందులు, నీ ప్రభువును కలవడానికి అడ్డగించనీయకు.


Our Lord's Faithful Friendship


ఏ సంబంధమైనా, స్నేహితులు లేక ప్రియమైన వారు అని అనిపించడం బదులు, ఒక పనిగా నీకు  అనిపించిందా? ఈరోజు వాక్యధ్యానం ప్రభువుతో మనకున్న సంబంధాన్ని లోతుగా పరిశీలించుకోవడానికి ప్రోత్సాహిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.