నేను నా కుర్చీలో కూర్చొని సూన్యంలోకి చూస్తూ ఉన్నాను. ఏదైనా అయితే? అనే ప్రశ్న నన్ను పీడించడం మొదలు పెట్టింది. ఎందుకంటే నా కుమారునికి హై ఫంక్షనింగ్ ఆటిజం, డిస్గ్రాఫియా, డిస్లెక్సీయా, ఉన్నాయని డాక్టర్చే నిర్ధారణ అయింది. నా కుమారుని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే తలంపులతో నేను సతమతమవుతున్నాను. నాకు జవాబులు ఏమీ తోచక పోవడంతో దేవుడు దూరంగా ఉన్నారు అనిపించింది.
నా జీవితం కుప్పకూలితే నేనేం చేయాలి, నేను ఆలోచించే సమాధానాలు ఖాళీవి అయితే?
సరిగ్గా ఆ క్షణంలో నా ముందు రెండే రెండు ఎంపికలు: నేను పూర్తిగా నిరాశ కూపంలో కూరుకుపోవడం లేదా దేవుణ్ణి ఇంకా ఎక్కువగా నమ్మి, ఆయన నాతో చేయించబోయే గొప్ప ప్రయాణానికి ఆయన్ని అనుమతించడం. పెద్ద వాటికి నాకు ఎప్పుడు విశ్వాసం ఉంటుంది, కాని నా ఇంటి విషయానికి వచ్చేటప్పటికి నా నియంత్రణలోనే అన్నీ ఉండాలనే మనస్తత్త్వాన్ని వదిలిపెట్టలేను.
ఆరోజు నేను తీసుకునే నిర్ణయం నా కుమారుని భవిష్యత్తును, నా భవిష్యత్తును ఇంతిలా మర్చివేస్తుందని అనుకోలేదు.
ఫిలిప్పీ 4:6 లో పౌలు ఈ విధంగా చెప్తారు దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. (ఫిలిప్పీ 4:6)
పౌలు దేనినిగూర్చియు చింతపడకుడి అంటే 'దేనినిగూర్చియు' అనే అర్ధం. చింతించడం అనేది దేవుని పేరును, ఆయన స్వభావాన్ని తిరస్కరించడమే. అయితే ఆయన సర్వశక్తిమంతుడు, సార్వభౌమాధికారం కలవాడు అయ్యుండాలి లేదంటే కాదు. నేను రోజూ కృతజ్ఞతను సాధన చేస్తుండగా, ఆయన పై లోతైన నమ్మకం పెరుగుతూ, నా దృష్టి నా సమస్యలపై నుండి దేవుని స్వభావం పైకి మారడం జరిగింది. అప్పుడు ఇంక నా కుమారుని భవిష్యత్తు ఆయన చేతికి అప్పగించి వదిలేసాను.
నువ్వు దేవునిపై నమ్మకం విషయంలో కష్టపడుతున్నావేమో, రోజూ ప్రార్ధన చేస్తూ, కృతజ్ఞత కలిగి ఉండటం సాధన చేస్తూ, ఆయన స్వభావాన్ని, గుణాలను ధ్రువీకరించు. అప్పుడు ఆయన పై నమ్మకం నీలో లోతుగా, బలంగా పెరగడం నువ్వే గమనిస్తావు.
The Power of Practicing Thankfulness
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.