నా మనవరాలు మొదటి సారి జారిడబల్ల ఎక్కి ఆడుకోవడం నేను గమనించాను. ఆమె దాన్ని ఎక్కినందుకు పట్టలేనంత ఆనందంతో హడావిడి చేసింది.
ఆ చిన్న క్షణంలో పాలుపొందటం సరదాగా అనిపించింది.
సరిగ్గా అదే సమయంలో ఒకటి నా మనసుకు తట్టింది. దేవుడు కూడా మన అటువంటి చిన్న క్షణాలను బట్టి ఆనందిస్తాడు కదా అని.
దేవుడు మనకు వెంటనే పూర్తి పరిపక్వతనివ్వగలరు. లేదంటే ఆయన్ని రక్షకునిగా అంగీకరించిన వెంటనే మనలను పరలోకానికి తీసుకెళ్లగలరు.
కాని దేవుడు మనకు ఎదిగే క్రమాన్ని పెట్టాడు. దానినే శుద్దీకరించబడటం అని అంటాం. కొన్నిసార్లు అది ఎంతో కఠినంగా అనిపించినా, అందులో ఎన్నో అద్భుతమైన క్షణాలు ఉంటాయి. అవి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అవి మనం గుర్తించినప్పుడు నిజమైన సంతోషం కలుగుతుంది.
మన పిల్లలు నడక నేర్చుకున్నప్పుడు, మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు, షూ లేసెస్ కట్టుకోవడం నేర్చుకున్నప్పుడు లేదంటే మొదటిసారి జారిడబల్ల ఎక్కినప్పుడు మనం ఎలాగైతే ఆనందపడతామో, దేవుడు కూడా మన ఆత్మీయ ఎదుగుదలను చూసి ఎంతో ఆనందిస్తారు (కీర్తన 147:11; జెఫన్యా 3:17).
మనం నిజంగా "దేవుడు చేసిన పనియైయున్నాము" (ఎఫెస్సీ 2:10).
మన వల్ల ఆనందపడటానికి దేవునికి ఒక కారణం ఇద్దామా!


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.