మనం అసలు ఏమి ఆలోచించాలో పౌలు చెబుతున్నాడు!

నువ్వు నీ మనస్సును ఫిలిప్పీ 4:8 తో తరుచూ పరీక్ష చేసుకుంటావా? మనం ఎందుకు ఈ పరీక్ష చేసుకోవాలో ఈరోజు వాక్యధ్యానంలో నేర్చుకుందాం.


మంచి విషయాలపై మన ధ్యానం ఉంటే, అదే మన ఆత్మకు శాంతి, సమాధానం ఇస్తుంది :


మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి. (ఫిలిప్పీయులకు 4:8)


నాకు మీ సంగతి తెలీదు గాని, నాకు మాత్రం శాంతి కావాలి, నాకు శాంతి చాలా అవసరం!


కాబట్టి అసలు మనం ఏమి ఆలోచించాలి?


ఏదైతే :


💜 సత్యం - అంటే ఖచ్చితమైనవి, నిజమైనవి. పుకార్లు లేక నిరూపించబడని ఆరోపణలు కావు.


💜 మాన్యత - అంటే నైతికంగా శ్రేష్ఠమైనవి. చెడు జోకులు లేక కథలు కావు.


💜 న్యాయం - అంటే మంచివి, సరైనవి. అసభ్యమైనవి లేక చాడీలు కావు.


💜 రమ్యమైనవి - ఆత్మీయంగా సంతోషకరమైనవి, చెడుతో వచ్చే సంతోషం కావు.


💜 ఖ్యాతి గలవో - స్ఫూర్తినిచ్చేవి, నిరుత్సాహన్నిచ్చేవి కావు 


💜 యోగ్యమైనవి - ఉన్నతమైనవి, అన్నింటికంటే పైనున్నవి 


💜 మెప్పు - దైవిక విలువలున్న మెప్పుకు తగిన 


రోజంతా, పనులు చేసే మధ్య మధ్యలో కొంత విశ్రాంతి తీసుకునే సమయంలో లేదా రాత్రి మెలుకువ వచ్చినప్పుడు, నిద్ర పట్టనప్పుడు, దేవుని శాంతిని వెదకే వారంగా మనం ఉండాలి. ఇది సాధన చేయడానికి ఉన్నతమైన మార్గం ఏమిటంటే, దేవుని ప్రేమను, దేవుని జ్ఞానాన్ని, దేవుని మహిమను గురించి ధ్యానించడం, ఆలోచించడమే!


Paul Tells Us What to Think About!


నువ్వు నీ మనస్సును ఫిలిప్పీ 4:8 తో తరుచూ పరీక్ష చేసుకుంటావా? మనం ఎందుకు ఈ పరీక్ష చేసుకోవాలో ఈరోజు వాక్యధ్యానంలో నేర్చుకుందాం.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.