మన హృదయాలను సరైన ఆత్మీయ ఆహారంతో నింపుకోవడం

ఈరోజు వాక్యధ్యానం రోజూ మనం తీసుకునే ఆహారాన్ని ఆత్మీయ పోషణతో పోలుస్తుంది. దేవుని వాక్యాన్ని మంచి పోషక విలువలతో ఉన్న ఆహారానికి పోల్చే వాక్యభాగాలను చదివి ఆనందించండి!


సాధారణంగా పిల్లలు రోజంతా స్నాక్స్ తింటే, భోజనానికి ఇంక వారి కడుపులో చోటు ఉండదు.


ఇది ఆత్మీయ ఆహరం గురించి ఒక మంచి పోలిక.


టీవి చూడటం, ఆటలు, ఇతర వినోదాలతో మనల్ని మనం నింపేసుకుంటే, బైబిల్ చదవడానికి, ప్రార్ధనకు, సహవాసానికి చోటు లేకుండా అయిపోతుంది, కనుక, అలా కాకుండా మనమే జాగ్రత్త పడాలి.


మన ఆత్మలకు అవసరమైన ముఖ్యమైన పోషకాహారాన్ని తీసుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మన ఆత్మలకు సరిపడా పోషకాలు సంతృప్తిగా అందే వరకు స్వీట్స్ తినడం నిరాకరించాలి.


• కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. (మత్తయి  6:33)


• మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును (మత్తయి 4:4)


• యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి (కీర్తనల 34:8)


• నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి. (కీర్తనలు 119:103)


• నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. (యిర్మీయా 15:16)


Filling Our Hearts With the Right Spiritual Food


ఈరోజు వాక్యధ్యానం రోజూ మనం తీసుకునే ఆహారాన్ని ఆత్మీయ పోషణతో పోలుస్తుంది. దేవుని వాక్యాన్ని మంచి పోషక విలువలతో ఉన్న ఆహారానికి పోల్చే వాక్యభాగాలను చదివి ఆనందించండి!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.