నా జీవితంలో, ఒక సమయంలో, యేసును యేసు కోసం కాదు, ఆయనిచ్చే ప్రయోజనాల కోసమే ప్రేమిస్తున్నాను అని గ్రహించాను. నిత్యజీవం నాకు సరిపోలేదు. ఇక్కడే, ఇప్పుడే ఇంకా నాకు వేరేవి కూడా కావాలి.
నేను ఈ కనువిప్పులోనికి రావడానికి కారణం, నా హృదయాన్ని కోసేసే, నా కలలను నాశనం చేసే, నా జీవిత గమనాన్నే ఎప్పటికీ మర్చివేసిన ఒకటి సంభవించడమే. అప్పుడు దేవునితో గొడవపడ్డాను. ఆయన నాకు ఇంకా ఋణపడ్డారు అని అనుకున్నాను.
యోహాను 6:26,27 లో ఉన్న గుంపు యేసును ఆతృతతో వెంబడించడానికి కారణం యేసు వారికిచ్చిన ఆహారాన్ని వారు ప్రేమించడమే కాని యేసును మీద ప్రేమతో కాదు. నేను కూడా వారిలో ఒకరిగా ఉన్నాను.
యేసుపై ప్రేమ, ఆయన గురించి సరైన అవగాహన నాకు లేదు అని ఎప్పుడైతే గ్రహించానో, నేను పశ్చాతాపపడ్డాను.
కాని అప్పుడప్పుడు ఈ అవలక్షణం నన్ను మరలా పలకరిస్తూ ఉంటుంది. అప్పుడు నా ఇహలోక జీవితంలో ఏమి సంభావించినా సరే, యేసు నా అర్హతకు మించి నాకు అన్నీ ఇచ్చారని మరలా నాకు నేను గుర్తుచేస్తుంటాను.
యేసును ఎటువంటి షరతులు లేకుండా మరి ఎక్కువగా ప్రేమించడానికి ఈరోజు నాతో కలిసి ఆయనను అడుగుదామా?
Loving Jesus No Strings Attached


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.