మిలమిల మెరిసే బిళ్ళలా లేక పరలోకపు నిధా?

మిలమిల మెరిసే బిళ్ళలా లేక నోట్లా? చిన్న పిల్లలకు వీటిలో దేనికి విలువ ఎక్కువో తెలీదు. కాని ఆధ్యాత్మికంగా మనం కూడా  ఇదే సమస్య కలిగి ఉంటాము (మత్తయి 6:19-20). అదేమిటో చూద్దామా!


చిన్న పిల్లలు మిలమిల మెరిసే బిళ్ళల కోసం ఎక్కువ విలువగల నోట్లను కూడా ఇచ్చివేయడానికి ఇష్టపడతారు. దేనికి ఎక్కువ విలువ ఉందో తెలుసుకోలేని అమాయకులు వాళ్ళు.


విచిత్రం ఏమిటంటే క్రైస్తవులము అయిన మనము కూడా భూసంబంధమైన వాటి కొరకు పరసంబంధమైన నిధిని వదులుకున్నప్పుడల్లా అదే తప్పు చేస్తున్నాము. (మత్తయి 6:19-20; 1తిమోతి 6:18-19).


పరసంబంధమైన నిధిని కేవలం కొన్ని మిలమిల మెరిసే బిళ్ళల కోసం అమ్ముకోవడం అంటే :

~సరైన మార్గము కంటే సులభమైన మార్గాన్ని ఎంచుకోవడం.

~మన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకునే అవకాశం వచ్చినపుడు దానినుండి తప్పించుకోవడం.

~లోకసంబంధమైన ధ్యేయాలనే గురిగా కలిగి ఉండటం.

~పరిశుద్ధ గ్రంధంలో దేవుడిచ్చిన విలువలను ఇతరులు వెక్కిరిస్తున్నపుడు ఏమీ పట్టనట్టు నోరుమూసుకొని ఉండటం.

~దేవుని ఆజ్ఞలలో కొన్నిటిని పట్టించుకోకపోవడం.


బీద విధవరాలు తన చివరాఖరి నాణాలను (బిళ్ళలను) త్యాగపూరితంగా అర్పించడం నీకు గుర్తుందా? ఆమె వాటిని ఇచ్చివేసి పరసంబంధమైన నిధిని సంపాదించుకుంది. (లూకా 21:1-4).


ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అని శతాధిపతి దీనత్వంతో చెప్పడం నీకు గుర్తుందా? ఆ శతాధిపతి కూడా భూసంబంధమైన గొప్పతనాన్ని ఇచ్చివేసి పరసంబంధమైన గొప్పతనాన్ని సంపాదించుకున్నాడు (మత్తయి 8:5-13)


మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిన ఆ కొందరు నీకు గుర్తున్నారా. (హెబ్రీయులకు 11:35)?


ఈసారి నుండి ఆ మిలమిల మెరిసే బిళ్ళలను దాచుకోవాలి అని అనుకునే ముందు ఒక్కసారి ఆలోచించుకుందాం ప్రియ క్రైస్తవా!


Shiny Pennies or Heavenly Treasure?


మిలమిల మెరిసే బిళ్ళలా లేక నోట్లా? చిన్న పిల్లలకు వీటిలో దేనికి విలువ ఎక్కువో తెలీదు. కాని ఆధ్యాత్మికంగా మనం కూడా  ఇదే సమస్య కలిగి ఉంటాము (మత్తయి 6:19-20). అదేమిటో చూద్దామా!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.