ఈ క్షణంలో జీవించుట

తక్షణమే నేను నా కోరికను తీర్చుకోవాలి అనే ఆశ ఈ వ్యక్తిని ఎంతో నాశనం చేసింది. బైబిల్లో అందరికి బాగా తెలిసిన ఈ వ్యక్తి గురించి ఈరోజు వాక్యాధ్యానంలో చూద్దాం!


ఈ క్షణంలో జీవించాలి (సుఖపడాలి) లేక మన కోరికలు తక్షణమే తీర్చుకోవాలి అనే లౌకిక ఒత్తిళ్లలో మనం జీవిస్తూ ఉంటాం. కాని దేవుడు మాత్రం దేవుని పరిశుద్దాత్మను అనుసరించి నడవాలని, ఆశా-నిగ్రహాన్ని సాధన చేయాలని, మన జీవితంలో దేవుని చిత్తాన్నే కోరాలని నొక్కి చెప్తున్నారు.


ఆదికాండము 25:29-34 లో ఏశావు పొలములో నుండి అలసిపోయి ఇంటికి రావడమే యాకోబు వండే ఆహారాన్ని కోరతాడు. ఒక మోసగాడుగా యాకోబు ఈ అవకాశాన్ని తన స్వార్ధం కోసం వినియోగించాలని, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే, ఈ కూరని నీకు ఇస్తాను అని చెప్తాడు.


జ్యేష్ఠకుమారునిగా ఏశావు తండ్రి ఆస్తి అంతటిలో రెట్టింపు భాగము పొందే హక్కుదారుడు . (ద్వితీయోపదేశకాండమ 21:17). కాని ఏశావు 'ఈ క్షణంలో జీవించాడు'. తన కోరిక తక్షణమే తీర్చుకోవాలి అనే ఆశ అతన్ని ఒక కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునేలాగా తృణీకరించేలాగా చేసింది.


తక్షణమే కోరికను తీర్చుకోవాలి అనేటువంటి మోహమే దైవభక్తిలేని ఒక భ్రష్టుడైన ఏశావు తయారవ్వడానికి కారణంగా చరిత్రలో ఒక ఉదాహరణగా మనం చూస్తాము (హెబ్రీయులకు 12:16-17).


ఈరోజుల్లో కూడా చాలామంది ఏశావును అనుకరించే వారు ఉన్నారు : వివాహనికి బైట చెడు సంబంధాలు కలిగి ఉండటం, రాబడిని జూదంలో పోగొట్టడం, దుబారాగా డబ్బులు ఖర్చుపెట్టడం, అతిగా తిండి తినడం లాంటి ఎన్నో చెడు అలవాట్ల ద్వారా.


ఆశా-నిగ్రహం కలిగి ఉండటం, కోరికలను తీర్చుకోవాలి అనే ఆశను వాయిదా వేయడం, సహనం కలిగి ఉండటం అనే విలువలు చాలా అరుదైనవి అయినప్పటికీ అవి చాలా విలువైన లక్షణాలు. వాటిని అలవరచుకుంటే గొప్ప ప్రతిఫలాన్ని పొందుతాము.


కనుక 'ఈ క్షణంలో జీవించుట' అనే అలవాటును మానుకోని దేవుని ఆత్మను అనుసరించి నడుచుకొనుటకు నిర్ణయించుకుందామా?


-------------------------


గమనించండి: 'ఈ క్షణంలో జీవించుట'..అనేది ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఉల్లాసంగా సంతోషిస్తున్నాను అని నీవు అనుకుంటున్నావేమో, కాని ఇందులో ఒక ప్రతికూల అంతరార్ధం కూడా లేక పోలేదు అని గుర్తించాలి!

Living in the Moment


తక్షణమే నేను నా కోరికను తీర్చుకోవాలి అనే ఆశ ఈ వ్యక్తిని ఎంతో నాశనం చేసింది. బైబిల్లో అందరికి బాగా తెలిసిన ఈ వ్యక్తి గురించి ఈరోజు వాక్యాధ్యానంలో చూద్దాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.