క్రీస్తును వెంబడించే వారికి ఉండవలసిన 6 కోరికలు

నీలో ఈ ఆరు కోరికలు ఉన్నాయా? ఇవి క్రీస్తును వెంబడించే ప్రతీ ఒక్కరికీ తప్పనిసరిగా ఉండవలసినవి!

1. సుఖంగా సంతోషంగా ఉండాలి అనే దానికంటే పరిశుద్ధంగా ఉండాలి అనే కోరిక కలిగి ఉండటం (1 యోహాను 2:15-17).

~ లోకంలో ఉన్నవాటిని ప్రేమించడం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం.


2. దేవుణ్ణి ఘనపరచడం లేక దేవునికి లోబడటం ఒకవేళ శ్రమకు గురిచేస్తుంది అని తెలిసినా అదే చెయ్యాలి అనే కోరిక కలిగి ఉండటం (ఫిలిప్పీయులకు 3:7-16).

~ అన్నిటికంటే ఎక్కువ క్రీస్తును తెలుసుకోవాలి అనే కోరిక కలిగి ఉండటం.


3. మనకు ఇవ్వబడిన సిలువను మోయాలనే కోరిక కలిగి ఉండటం (మత్తయి 16:24).

~ దేవుడు దేనికి మనల్ని పిలిచారో దానిని చేయడానికి ఎటువంటి అభ్యంతరం చూపక పూర్తిగా లోబడటం.


4. దేవుని దృష్టినుంచే ప్రతీదాన్ని చూడాలి అనే కోరిక కలిగి ఉండటం (మత్తయి 6:19-20).

~ పరలోకంలోనే మనం ధనాన్ని కూర్చుకోవాలి, ఎందుకంటే ఈలోకంలో మన జీవిత పరిమాణం కేవలం ఒక ఊపిరితో సమానం.


5. దేవుని దిద్దుబాటు, క్రమశిక్షణల ద్వారా నేర్చుకోవాలి అనే కోరిక కలిగి ఉండటం (హెబ్రీయులకు 12:4-11).

~ బోధనొందే మనస్సు కలిగి ఉండటం, పశ్చాత్తాప పడటానికి త్వరపడటం, పాపాలను గుర్తించి, వాటినుండి నేర్చుకోవడం.


6. మనపై మన గురి కంటే ఇతరులపై శ్రద్ద చూపే కోరిక కలిగి ఉండటం (ఫిలిప్పీయులకు 2:3-4).

~ మనపై మన గురి మనలను స్వార్ధానికి నడిపిస్తుంది.


ప్రియప్రభూ! మా అందరిలో ఈ ఆరు కోరికలు పుట్టేలాగ సహాయం చేయండి 🙏


6 Desires of Christ-Followers


నీలో ఈ ఆరు కోరికలు ఉన్నాయా? ఇవి క్రీస్తును వెంబడించే ప్రతీ ఒక్కరికీ తప్పనిసరిగా ఉండవలసినవి!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.