సోదె చెప్పుట, దేవతలను పూజించుటతో సమానమైన

దేవుడు అన్ని పాపాలను ఒకేలాగ చూస్తారనే ఒక తప్పుడు బోధ ఉన్నప్పటికీ, ఆయన కొన్ని పాపాలను తీవ్రమైనవిగా చూస్తారని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు వాక్యధ్యానంలో అలాంటి పాపాల్లోకెల్లా అతి తీవ్రమైన దానిని చూద్దాం!

రాజైన సౌలు దేవుడు చెప్పిన ఆదేశాలలో తనకు నచ్చిన వాటినే ఏరుకొని పాటిస్తున్నాడని సమూయేలు ప్రవక్త తనను ఖండించాడు. కాని సౌలు మూర్ఖుంగా తాను చేసిన తప్పును సమర్థించుకున్నాడు (1 సమూయేలు 15)


అప్పుడు సమూయేలు "తిరుగుబాటు చేయుట సోదెచెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము." అని చెప్పాడు (1 సమూయేలు 15:23)


సౌలు కపటంతో క్షమాపణ కోరాడు. ఆరోజే సౌలుకు ఇవ్వబడిన అభిషేకాన్ని తననుండి తొలగించాడు దేవుడు.


క్రైస్తవులకు సోదెచెప్పుట, మాయావిగ్రహము గృహదేవతలను పూజించుట అనేవి చేయరాని పాపాలు అనే అవగాహన ఉంది, చెయ్యరు కూడా. కాని తిరుగుబాటు చేయుట, మూర్ఖతను అగపరచుట అనేవి కూడా అంతే తీవ్రమైన పాపాలని అసలు అర్ధమవుతుందా?


ఎలాగైతే రాజైన సౌలు దేవుడిచ్చిన ఆదేశాలను మనుషులను సంతోషపెట్టడం కోసం మార్పులు చేసాడో (1 సమూయేలు 15:24), క్రైస్తవులం అని చెప్పుకునే ఈనాటి వారు కూడా స్నేహితులను సంతోషపెట్టడానికి, లోక మర్యాద కోసం లేక వారిలో ఉన్న పాప కోరికలు తీర్చుకోవడానికి దేవుని ఆజ్ఞలలో మార్పులు చేస్తున్నారు.


వారి వంకర మార్పులను సౌలు వలే మూర్ఖుంగా సమర్దించుకుంటున్నారు.


నేటి సంస్కృతి - చెడ్డ మాటలను, త్రాగుడును, ప్రోత్సాహిస్తుంది, బాహ్య సౌందర్యం మీద ఎక్కువ శ్రద్ద పెడుతుంది, వస్తువులపై ఎక్కువ మోజు ఆకర్షణ కల్పిస్తుంది, పెళ్ళికి ముందే కలిసి ఉండటాన్ని, స్వలింగ సంపర్కాన్ని, లింగమార్పిడిని ఇంకా ఇతర చెడ్డవాటిని ఎంతో ప్రోత్సాహిస్తుంది.


క్రైస్తవులం అని చెప్పుకునే వారిలో ఎవరైనా వీటిని సమర్దిస్తే, వారు దేవునికి, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారని, మూర్ఖులుగా ఉన్నారని అర్ధం.


మన హృదయాలను సోదెచెప్పుట, మాయావిగ్రహము గృహదేవతలను పూజించుట అనే పాపాలనుండి ఎంత కాపాడుకుంటామో, అంతే తీవ్రంగా తిరుగుబాటు చేయుట, మూర్ఖతను అగపరచుట అనే పాపాల నుండి కూడా కాపాడుకోవాలి.


As Serious As Witchcraft or Idol Worship


 

దేవుడు అన్ని పాపాలను ఒకేలాగ చూస్తారనే ఒక తప్పుడు బోధ ఉన్నప్పటికీ, ఆయన కొన్ని పాపాలను తీవ్రమైనవిగా చూస్తారని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు వాక్యధ్యానంలో అలాంటి పాపాల్లోకెల్లా అతి తీవ్రమైన దానిని చూద్దాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.