తక్కువే, ఎక్కువ కాదు

అతిచిన్న వయస్సులో రేచెల్ సెయింట్, విందు-వినోదంతో సుఖపడే జీవితాన్ని లేక అడవిలో కఠినమైన పరిస్థితుల జీవితాన్ని ఏదో ఒకదాన్ని కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె దేనిని కోరుకుందో తెలుసుకుందామా.


"నువ్వైతే ఏమి చేసే దానివి, ఎమ్మా?"


"నేనైతే ఆ వారసత్వాన్నే కోరుకునేదాన్ని."


రేచెల్ సెయింట్ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి నా మనవరాలు నేను మాట్లాడుకుంటున్నాం :


శ్రీమతి.పర్మలీ సంతానం లేని ఒక కోటీశ్వరురాలు. యూరోప్ దేశంలోని పట్టణాలలో తనకు తోడుగా ప్రయాణించడానికి, ఖరీదైన ఆహారం తినడానికి, ధనవంతులైన ప్రముఖులతో షాపింగ్ చేయడానికి, 17 ఏళ్ల రేచెల్ సెయింట్ ని అడిగింది. ఒకవేళ రేచెల్ ఒప్పుకుంటే పర్మలీకి ఉన్న ఆ కోట్లకు ఆమే వారసురాలు అయ్యేది.


కాని దక్షిణ ఆఫ్రికా అడవుల్లో మిషన్ పని కోసం తనని దేవుడు పిలిచాడని రేచెల్ గ్రహించి, తన దగ్గరకు వచ్చిన ఈ ఆఫరును తిరస్కరించింది.


తనైతే ఏమి చేసేదో నా మనవరాలు
చెప్పిన యదార్థమైన జవాబుకు ఆమెను నేను మెచ్చుకున్నాను, నేను కూడా 17 ఏళ్లప్పుడు శ్రీమతి.పర్మలీ ఇచ్చిన ఆఫర్ నే తీసుకునేదాన్నేమో అని ఒప్పుకున్నాను. కాని అలా చేస్తే మనం తక్కువే ఎన్నుకునే వాళ్ళం ఎక్కువ కాదు అని కూడా చెప్పాను.


రేచెల్ సెయింట్ తన తమ్ముడిని చంపిన జాతికి పరిచర్య చేసింది. తన జీవితకాలమంతా చాలా కఠినమైన పరిస్థితుల మధ్య జీవించి, శ్రీమతి.పర్మలీ ఇచ్చిన ఆఫర్ కంటే మించి ఎంతో ఎక్కువ ధనాన్నే సంపాదించింది (మత్తయి 6:19-20)


17 ఏళ్లప్పుడు నువ్వైతే ఏమి ఎన్నుకుంటావు? పోని, ఈరోజు నీ ఎంపిక ఏమిటి?


Less, Not More


అతిచిన్న వయస్సులో రేచెల్ సెయింట్, విందు-వినోదంతో సుఖపడే జీవితాన్ని లేక అడవిలో కఠినమైన పరిస్థితుల జీవితాన్ని ఏదో ఒకదాన్ని కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె దేనిని కోరుకుందో తెలుసుకుందామా.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.