చాలా ముఖ్యమైనది!

యేసుకు ఖరీదైన ఆహరం కంటే "అవసరమైనది" ఒకటి ఉందని లేఖనాలలో స్పష్టంగా తెలుపబడింది. ఈరోజు వాక్యధ్యానంలో దీనిని తెలుసుకుందాం!


మరియ యేసు పాదాల వద్ద కూర్చోని ఆయనతో సమయాన్ని గడుపుతూ ఆనందిస్తుంది. తన సహోదరి మార్త భోజనం సిద్దపరిచే విషయంలో ఒత్తిడికి గురవుతూ, మరియ సహాయాన్ని కోరుతుంది.


అందుకు ప్రభువు మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. (లూకా 10:38-42)


ఇది ఎంత అద్భుతమైన మాట. యేసుకు కావాల్సినది చాలా ముఖ్యమైనది ఒకేఒక్కటి. అదేమిటంటే మార్తతో సమయం.


ఇది ఒక సున్నితమైన గద్దింపు మాత్రమే కాదు గాని ఒక అద్భుతమైన ఆహ్వానం కూడా!


యేసుకు ఈ భూమి మీద కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలి ఉండగా,  మరియ, మార్త, లాజరుతో కొంచెం సమయం గడపడానికి ఆయన వచ్చారు.


ఆయనకు కావాల్సింది ఖరీదైన భోజనం కాదు గాని తన స్నేహితులతో కొంచెం సమయం.


యేసు మన ఇళ్లల్లో కూడా ఉండి, ఆయన పాదాలు దగ్గర కూర్చోమని మనలను కూడా ఆహ్వానిస్తున్నారు.


• శారీరిక అవసరాలు తీర్చడం, యేసుకు సేవలందించడం ముఖ్యమే కాని రెంటికి పునాది ఆయనతో సమయం గడపడమే.


"ఒకే ఒక్కటి ముఖ్యమైనది, అదే చింతించడానికి యోగ్యమైనది" దానిని నిర్లక్ష్యం చేయకుండా ఉండటానికి సహాయం చేయమని నాతో కలిసి దేవుణ్ణి అడుగుతారా?


The Most Important Thing


యేసుకు ఖరీదైన ఆహరం కంటే "అవసరమైనది" ఒకటి ఉందని లేఖనాలలో స్పష్టంగా తెలుపబడింది. ఈరోజు వాక్యధ్యానంలో దీనిని తెలుసుకుందాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.