"మురికి కూడా శుభ్రంగా కనపడుతుంది!"

నా జీవితంలో జరిగిన ఈ విషయం నా శారీరిక మరియు ఆత్మీయ దృష్టికి ఒక లోతైన అవగాహననిచ్చింది.


నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు నాకు కళ్ళద్దాలు వచ్చాయి. అప్పటినుండి  అవంటే నాకు చాలా ఇష్టం.


అన్నింటినీ స్పష్టంగా చూడగలుతున్నాను కాబట్టి, కళ్ళద్దాలు పెట్టుకోవడం వలన ఆకర్షణీయంగా ఉండనేమో అనే దిగులు నాకెప్పుడూ ఉండేదికాదు (నా స్నేహితురాళ్లలో కొందరికి అటువంటి దిగులు ఉండేది).


"మురికి కూడా శుభ్రంగా కనపడుతుంది!" అని నేను మా అమ్మకి చెప్పడం ఇంకా నాకు గుర్తుంది.


దాని అర్ధం ఏమిటంటే, మురికితో సహా అన్నీ, నాకు చాలా స్పష్టంగా, ఎటువంటి మసకదనం లేకుండా కనపడుతున్నాయి అని.


సరిగ్గా అదే 'దిద్దుబాటు చేసే అద్దం' వంటి పనే దేవుని వాక్యానిది కూడా.


దేవుని వాక్యం లేకుండా అన్నీ గజిబిగా కనపడతాయి. కాని దానితోనైతే పాపాలు అనేవి చాలా మెరుగుగా, అత్యంత స్పష్టంగా, ఎటువంటి మసకదనం లేకుండా కనపడతాయి.


చాలా మంది క్రైస్తవులు ఈ లోకానికి వారు ఆకర్షణీయంగా కనపడరేమో అనే భయంతో "దేవుని వాక్యం అనే కళ్ళద్దాలను" తీసి పక్కన పెట్టేయడం నేను గమనించాను.


కాని అలా దేవుని వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను పక్కన పెట్టేయడం వలన దేవుని దృష్టికి వారు ఆకర్షణీయంగా ఉండలేరనే విషయాన్ని మర్చిపోతున్నారు :


నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో, వానిని గూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను. (మార్కు 8:38)


ప్రభువుకు ఏది ప్రీతికరమో దానినే చేయడానికి ఆయన సహాయాన్ని కోరదామా (ఎఫెస్సీయులకు 5:10).


"Even the Dirt is Clean!"


నా జీవితంలో జరిగిన ఈ విషయం నా శారీరిక మరియు ఆత్మీయ దృష్టికి ఒక లోతైన అవగాహననిచ్చింది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.