• సమాధానం అనేది ఎంతో విలువైన రత్నం.... దానికోసం నేను ఏదైనా ఇస్తాను, ఒక్క సత్యాన్ని తప్ప - మాత్త్యూ హెనరీ ( బైబిల్ పండితుడు )
• బానిసత్వం, సంకెళ్ల యొక్క వెలను ఇచ్చి కొనేంత ప్రియంగా జీవితం ఉందా, లేక అంత తీయనిదిగా సమాధానం ఉందా? సర్వశక్తుడవైన దేవా, అది నాకు దూరమగును గాక! ~ పాట్రిక్ హెనరీ, అమెరికా దేశభక్తుడు.
మన సమాజంలో వారు ఏమి చేస్తున్నా, ఎలాంటి నమ్మకాలు కలిగున్నా పర్వాలేదు కాని, మనల్ని మాత్రం వారు మెచ్చుకోవాలి, గౌరవించాలి అన్నదే మనకు ప్రాముఖ్యమైతే, దేవుని లేఖనాలను మనం తృణీకరించాల్సిందే.
ఎందుకని? సిలువను గూర్చిన వార్త అవిశ్వాసులకు వెర్రితనం గనుక (1 కొరింధీయులకు 1:18). వాస్తవం ఏమిటంటే, రక్షణ సువార్త మన ద్వారా మన చుట్టూ ఉండే వాళ్లకు "మరణపు వాసన" ఇస్తుందని లేఖనం చెబుతుంది గనుక (2 కొరింధీయులకు 2:15-16).
అందుకే యేసు ప్రభువు హెచ్చరిక ఏమిటంటే "తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ద దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును. (లూకా 9:24-26)
ఒక గంభీరమైన హెచ్చరిక. లక్ష్యపెట్టడం మొదలుపెడదామా!
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.