1909 సంవత్సరంలో కోలోరోడోలో ఉన్న స్వింక్ అనే చిన్న ఊర్లో మా అమ్మమ్మ పుట్టింది. ఆ కుటుంబం ఒక గుడారంలో నివసించేవారు.
పెరుగుతున్న కుటుంబాన్ని ఆ గుడారంలో పోషించుకోవడం, కట్టెల పొయ్యి మీద వండుకోవడం, కోలోరోడోలో వచ్చే వాతావరణం మార్పులకు తట్టుకోవడం, సరైన మంచి నీరు సదుపాయం లేకుండా జీవించడం.. ఇవన్నీ నా ముత్తాతలు అనుభవించారు. వారికి ఆ రోజులు ఎంత కష్టంగా ఉండేవో నేను పూర్తిగా ఊహించలేను.
నేను కూడా గుడారంలో క్యాంప్ చేసాను కాని అందులోనే జీవించలేదు.
లేదు, ఇది నిజం కాదు!
మన శరీరం ఒక "తాత్కాలికమైన గుడారం". మన పరలోక ఇల్లు పూర్తిగా కట్టే వరుకు ఈ శరీరంలో మనం జీవిస్తున్నాం అని 2 కొరింధీ 5:1-5 లో పౌలు వివరించాడు.
మన భూసంబంధమైన గుడారాల్లో మనం సంతోషంగా ఉంటాం. కాని మన గుడారం వయస్సు మీరినప్పుడు, ప్రతికూల పరిస్థితులు అనే గాలులు వీచినపుడు, ఇబ్బందులు అనే తుఫానులు వచ్చినప్పుడు, మనం అలిసిపోయి.. 'భారముతో మూల్గుతూ' ఉంటాం. మనకు సేదతీర్చడానికి జీవజలపు ఊటలు ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాయి (యోహాను 7:38) దేవుడే మన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు (సామెతలు 30:5), అయినప్పటికీ ఈ గుడారపు జీవితం అంత సులభమైనదేమీ కాదు.
ఇక్కడ ఉన్నంత కాలం మనం చేయడానికి దేవుని నుండి మనకు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ, విశ్వాసులంగా మనకు ఒక వాగ్దానం ఉందని మర్చిపోకూడదు. అదేమిటంటే, ఒక రోజు మన పరలోక గృహంలో మనం చేరతాం, మన ప్రియ ప్రభువును ముఖాముఖిగా చూస్తాం (1 కొరింధీ 13:12). చావునకు లోనయ్యే మన ఈ శరీరాలు జీవం చేత మ్రింగివేయబడుతాయి (2 కొరింధీ 5:4).
ఈరోజు ఈ సత్యాన్ని మనసులో పెట్టుకో : యేసు క్రీస్తు ప్రభువు నీ రక్షకుడైతే, నువ్వు ప్రయాణించేది జీవం వైపే కాని మరణం వైపు కాదు.
భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొననపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే; మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకనుగ్రహించియున్నాడు. (2 కొరింథీ 5:1-5)
Some Insights on Tents and Eternity
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.