"యెహోవా నా స్వాస్థ్యభాగము" (కీర్తనలు 16:5) అని పలికిన కీర్తనాకారుడి మాటలను గమనించు (కీర్తనలు 119:57; విలాపవాక్యములు 3:24).
దేవుడు వాగ్దాన భూమిలో స్థలాలను పంచిపెడుతున్నప్పుడు, లేవీయులు మాత్రం ఎటువంటి భూభాగాలను స్వాస్థ్యంగా పొందరని చెప్పాడు. దాని బదులు "నేనే మీ పాలు, మీ స్వాస్థ్యం" అని వివరించాడు (సంఖ్యాకాండము 18:20).
వారికి ఇశ్రాయేలేయులలో మిగతా 11 గోత్రాల వారిలా ఏ భూమిని స్వాస్థ్యముగా ఇవ్వకుండా, దాని బదులు ఆ లేవీయులను యాజకులుగా నియమించి, ప్రత్యక్షపు గుడారములో దేవుని సేవించడానికి ఎన్నుకుంటారు.
ఒక విధంగా చెప్పాలంటే క్రైస్తవులు ఈ లేవీయులను పోలిన వారే. ఎందుకంటే 1 పేతురు 2:9 లో ఈ విధంగా వ్రాసి ఉంది. "అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునైయున్నారు."
"దేవుడే మన స్వాస్థ్యం" అనే వాస్తవం ముందు, ఈ భూమిపై మనకు ఏమి ఉంది, ఏమి లేదు అనేది చాలా అల్పమైన విషయం. ఎందుకంటే మనం ఈ భూసంబంధమైన లక్ష్యం కోసం గాని ఆస్తుల కోసం గాని పని చెయ్యము.
"...దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము." (ఎఫెసీయులకు 2:10)
అలాగని దీని అర్ధం అందరం కాపరులం, సంఘంలో పని చేసేవారం, లేక మిషనరీలం అని కాదు. కాని మనం "పూర్తి సమయం దేవుని సేవకే" అంకితం చేసుకోవలసిన వారం. ఎందుకంటే మనం ఏమి చేసినా అది దేవునితో కలిసి దేవుని కోసమే చేయవలసిన వారం గనుక (కొలస్సీయులకు 3:23-24).
• అసలు నీ జీవితంలో ఉన్న ప్రణాళికలు దేవుని చిత్తాన్ని ఆధారం చేసుకొని తీసుకున్నావేనా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నావా (మత్తయి 6:33)? ఆయన మాత్రమే నీ స్వాస్థ్యమా, కాదా?
Is the Lord Your Portion or Are You Seeking "Land"?
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.