"మన సమాజంతో మనం పాలుపంచుకోవాలి, కాని దాని చేత కలుషితం అవ్వకూడదు" - ఎర్విన్ లుటజర్.
దేవునిలో ఎదగడం ఎలానో, అనైతికత, అపనమ్మకం, చెడు ప్రభావాలతో నిండినపోయిన సమాజంలో ఉంటూనే దేవునిలో స్థిరంగా ఉండటం ఎలానో ఫిలిప్పీయులకు 2:12-16 మనకు చెబుతుంది :
1. దేవుని యెడల భయభక్తులను చాలా తీవ్రంగా, ఉద్దేశపూర్వకంగా వెతకాలి.
కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.
• ఇది కూడా చూడండి ~ ఎఫెస్సీయులకు 4:22-24.
2. దేవుడు మనలను లోపల నుండి బయటకు మారుస్తున్నప్పుడు, ఆయనకు మనం లోబడాలి.
"...మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును... "
• ఇది కూడా చూడండి ~ రో్మీయులకు 6:19
3. మన ప్రణాళికల మీద కాదు, దేవుని ప్రణాళికల మీదే గురి కలిగి ఉండాలి.
"...తన దయాసంకల్పము నెరవేరుటకై..."
• ఇది కూడా చూడండి ~ ఎఫెస్సీయులకు 2:10.
4. మనలను మనం తృణీకరించుకోవాలి.
"సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి."
• ఇది కూడా చూడండి ~ మార్కు 8:34.
5. లోకమర్యాదను అనుసరించకుండా, మన హృదయాన్ని, ప్రవర్తనను నూతనపరచుకోవాలి.
"...మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు,..."
• ఇది కూడా చూడండి ~ రో్మీయులకు 8:12-13.
6. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని, నశించిపోతున్న లోకానికి దానిని అందిస్తూ, మనం జ్యోతులవలే ప్రకాశించాలి.
"...అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు..."
• ఇది కూడా చూడండి ~ మత్తయి 5:16
మనం వెతుకుదాం, లోబడదాం, గురికలిగుందాం తృణీకరించుకుందాం, నూతనపరచబడదాం, ప్రకాశిద్దాం, ప్రియ క్రైస్తవులారా.
6 Ways to Engage Culture Without Becoming Contaminated By It
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.