చాలా మంది క్రైస్తవులు 'అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత' అనే వచనం యొక్క (యెషయా 53:5) అర్ధం, ఈ భూమిపై పూర్తిగా స్వస్థత పొందడం అని ప్రతిపాదిస్తుంటారు.
అసలైతే ఈ వచనం యొక్క సందర్భం పాపం మరియు విమోచన (యెషయా 53; 1 పేతురు 2:24). కాని మత్తయి 8:16-17 లో దీనిని దయ్యం పట్టడం మరియు శారీరిక స్వస్థతకు ముడిపెట్టడం చూస్తాం. (1)
ఇది నిజంగా నిజమే - మన విమోచన శరీరంలో, ఆత్మలో పూర్తిగా నెరవేర్చబడింది.. కాని అది ఆత్మీయ రంగంలో.
యేసు నెరవేర్చిన మన విమోచన కార్యం ఈ భూమిపై పూర్తిగా కనపడేది కాదు (1 కొరింధీ 15:22-25; హెబ్రీ 2:5-9).
ఎప్పుడైతే యేసు 'సమాప్తమైనది' అని పలికారో అప్పుడే ఆయన పొందిన దెబ్బల ద్వారా పాపం, అపవాది, సమస్యలు, అనారోగ్యం, మరణం అన్నీ ఓడిపోయాయి (యోహాను 19:30).
అయినా పాపం, అపవాది, సమస్యలు, అనారోగ్యం, మరణం ఈ భూమిపై ఉనికిలోనే ఉన్నాయి (2 కొరింధీ 4:16-18). మనకు ఎంత విశ్వాసం ఉన్నా అవి ఇక్కడ ఉనికిలోనే ఉంటాయి (యోహాను 16:33).
మనం పునరుద్దరణ పొందే క్రమంలో ఉన్నాం. కొన్నిసార్లు ఈ భూమిపై మానవాతీతమైన రీతిలో దేవుడు దైవిక స్వస్థత జరిగించవచ్చు (2), కాని ఆత్మీయ, మానసిక, శారీరిక ఆరోగ్యం మనకు సంపూర్ణంగా అందుబాటులోకి వచ్చేది నిత్యత్వంలోనే, మనం పూర్తిగా రూపాంతరం పొందినప్పుడే (1 కొరింధీ 13:12; 1 యోహాను 3:2) (3).
• మన విశ్వాసం అదృశ్యమైనవి ఉన్నవి అనే దానిపై కట్టబడేది (హెబ్రీ 11:1).
----------------------
(1) మత్తయి, యెషయా 53:4 ని పరిగణలోనికి తీసుకున్నా, సందర్భాన్ని మాత్రం యెషయా 53:5 ని తీసుకోవడం గమనించాలి.
(2) అనారోగ్యం, స్వస్థతలకు అనేక కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు అనారోగ్యం పాపానికి, అపనమ్మికకు సంబందించినా, అన్నిసార్లు అవే కారణాలు కావు. కొన్ని అపోహలు పెట్టుకోని అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని బాధపెడితే, మనం కూడా దేవుడు ఖండించిన యోబు స్నేహితులవంటివారమే అవుతాము. మనమెలాగైతే రక్షింపబడ్డామో, రక్షింపబడుతూ ఉన్నామో, రక్షింపబడతామో, అదేవిధంగా మనం స్వస్థత పొందాము, పొందుతూ ఉన్నాము, పొందుతాము అని గుర్తుపెట్టుకోవాలి.
(3) 1 కొరింధీ 15:20-28 కూడా చూడండి. రెండవ రాకడ వచ్చే వరకు యేసు యొక్క మిషన్ పూర్తి కాదు అని ఈ వచనం చెబుతుంది. అంతే కాదు క్రీస్తు అనుచరులు ఈ భూమిపై ఉండగా అన్నీ వారి ఆధీనంలోకి రావు అని హెబ్రీ 2:5-9 చెబుతుంది.
Misunderstandings About the Stripes of Jesus
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.