బైబిల్ దేవుని కధ. తనను ప్రేమించేవారిని క్షమించే, భరించే, ఆదరించే దేవుని కధ.
ఈ భూమిపై ఉన్న మన జీవితాల యొక్క నిజమైన అర్ధం, ఉద్దేశం... అలానే రాబోయే జీవితాన్ని దృష్టిలో పెట్టుకోని అన్నింటినీ అధిగమించగలిగే సంతోషం గురించిన కథ ఇది.
దేవునితో 40 ఏళ్ళు నడిచిన నేను, ఒక్కసారి వెనక్కి తిరిగి ఒకవేళ నేను దేవుని యొక్క కధలో భాగమవటానికి ఒప్పుకోకపోయి ఉంటే నా కథ ఇప్పటికి ఎంత వైరుధ్యంగా ఉండేదో కదా అని ఆలోచిస్తాను.
మనం యేసును వెంబడిస్తే, మన జీవితపు ఆశయం మనల్ని మనం తృప్తిపెట్టుకోవడం నుండి దేవుని తృప్తిపరిచాలనే ఆశయంగా మారిపోతుంది (ఎఫెస్సీ 5:8-10).
మన కథ మనకు అర్ధం కాకపోయినా (తరుచూ అదే జరుగుతుంది), పరిస్థితులు మీద కాకుండా, మన కథ యొక్క కర్త మీద ఆధారపడటం నేర్చుకుంటాం (హెబ్రీ 12:2). మన కష్టాలు దేవునిపై మనకున్న విశ్వాసాన్ని అధిగమించలేవు అని నేర్చుకుంటాం. పైగా యేసును లోతుగా తెలుసుకోవడానికి, ఆయన్ని ఎక్కువ నమ్ముకోవడానికి ఈ కష్టాలే అవకాశాలుగా మారిపోతాయి.
దేవుని నీ, నా కథను వ్రాయనిస్తే, మన జీవితం ఏమి సులభంగా మారిపోదు. కాని అది మనం ఊహించినదానికంటే మించి మన జీవితాలను ఎంతో అర్ధవంతంగా, ఉద్దేశపూర్వకంగా మార్చేస్తుంది.
ఒకోసారి వెనక్కి తిరిగి దేవునితో "ఒకే పేజీలో" ఉన్నమో లేదో అడిగి తెలుసుకోవడం చాలా మంచి అలవాటు. ఒకే పేజీలో లేకపోతే, మన చేతిలో ఉన్న కలాన్ని తిరిగి ఆయన చేతిలో పెట్టాలి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.