రాజీపడిపోవడం విశ్వాసాన్ని చంపేస్తుంది.
పాత నిబంధన సమయంలో ఉన్న దేవుని ప్రజలు, ఎప్పుడూ దేవుని ఆజ్ఞలను అన్య ఆచారాలను కలపడానికి ప్రయత్నించేవారు. విగ్రహాలకు తమ పిల్లలను బలివ్వడంతో వారి రాజీ మొదలవ్వలేదు కాని ఒక దానిలో రాజీపడటం ఇంకోదానికి, అది ఇంకోదానికి దారితీసి, చివరికి విగ్రహాలకు తమ పిల్లలను బలివ్వడం సరైనదే అని సమర్థించుకునే పరిస్థితికి దిగజార్చింది. మన సమాజంలో కూడా ఇలా తప్పులను సమర్థించుకునే సంప్రదాయం ఉందని నీకు అనిపించిందా?
న్యాయధిపతుల గ్రంధంలో కూడా ఇటువంటి రాజీపడిపోయేతత్వం ప్రజల్లో తళుక్కుమని కనిపించడం ఈ వచనం ద్వారా అర్ధం చేసుకోగలం. "ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను". (న్యాయాధిపతులు 17:6; 21:25).
ఆధునిక సమాజానికి ఈ వర్ణణ అద్దం పట్టినట్టు ఉంది. గత కొన్ని సంవత్సరాలలో, క్రైస్తవులం అని చెప్పుకునే వారు లెక్కలేనన్ని చిన్న చిన్న వాటిల్లో రాజీపడిపోతూ ఉండటం నేను గమనిస్తున్నాను. ఒక చిన్న దానితోనే ప్రారంభమయినా, అది అక్కడితో ఆగిపోయేదికాదు.
చరిత్రలో ఇటువంటి సమయాల గురించే లేఖనాలు మనలను హెచ్చరించడం గమనించాలి. "సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగుకాలము వచ్చును". వారు తమ స్వకీయ దురాశాలను అనుసరిస్తారు, దురద చెవులకు అనుకూలమైన భోదలు చెప్పే బోధకుల కొరకు చూస్తారు (2 తిమోతి 4:1-5).
ప్రియ చదువరి, నీ దురద చెవులు ఏమి వినాలని ఎదురుచూస్తున్నాయి? నీ దురద చెవులు సంపూర్ణమైన హితబోధను, నిజమైన సువార్తను వినడానికి ఇష్టపడుతున్నాయని ఆకాంక్షిస్తున్నాను.
మన ఆత్మీయ యుద్ధరంగం యొక్క తీవ్రతను తక్కువంచనా వేయకూడదు. అందుకే వాక్యాన్ని చదవడం, ధ్యానించడం, పంచుకోవడం, ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పడం కూడా తక్కువంచనా వేయకూడదు.
కొంత సమయం తీసుకొని దైవిక నియమాలలో ఎక్కడైనా రాజీపడిపోయావేమో దేవుణ్ణి ఈరోజే అడుగు. ఆయన నీకు ఏదైనా తెలియజేస్తే, సంపూర్ణంగా పశ్చాతాప పడి, సత్యం వైపుకు తిరగడానికి ఆయన సహాయాన్ని వేడుకో.
One Compromise and Then Another and Then Another...
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.