దైవిక నిర్ణయాలకు అయిదు హెచ్చరికలు

దైవికమైన జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే, లేఖనాలలో నుండి ఈ అయిదు హెచ్చరికలు పాటించడానికి జాగ్రత్తపడాలి!


నేను ఇది చేస్తే, నా విశ్వాసం దెబ్బతింటుందా?

నేను ఇది చేస్తే, నా విశ్వాసానికి సహాయపడుతుందా?


ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నపుడు, ఈ రెండు ప్రశ్నలు మనకెంతో సహాయపడతాయి.

మనం ఏదో మాములుగా అశ్రద్ధతో నిర్ణయాలు తీసుకోవడాన్నుండి తప్పించుకోవాలి. అంతే కాకుండా భయంతో నిర్ణయాలు తీసుకోవడాన్నుండి కూడా తప్పించుకోవాలి.

• దేవుడు మన వైపు ఉన్నాడు - మనం జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవాలని, మనకు సహాయం చేయడానికి ఆయన ఆతురత కలిగి ఉన్నాడు. (సామెతలు 2:1-12) ఈ సత్యాన్ని గుర్తుచేసుకోవడం మనకెంతో సహాయపడుతుంది.

ఈ అయిదు "హెచ్చరికలు" మనకు సహాయపడతాయి :

1. మనం తీసుకునే నిర్ణయాలు వాక్యాన్ని అతిక్రమించేదిగా ఉండకుండా జాగ్రత్తపడాలి (2 తిమోతి 3:16-17).

2. మనం తీసుకునే నిర్ణయాలు స్వార్ధంతో తీసుకునేవిగా ఉండకుండా జాగ్రత్తపడాలి (ఫిలిప్పీ 2:3).

3. మనం తీసుకునే నిర్ణయాలు ఉన్నతమైనవి కాకుండా మంచివి ఎన్నుకునేవిగా ఉండకుండా జాగ్రత్తపడాలి (ఎఫెసీ 5:15-17).

4. మనం తీసుకునే నిర్ణయాలు లోకమర్యాదను అనుసరించేవిగా ఉండకుండా జాగ్రత్తపడాలి (రోమా 12:2).

5. మనం తీసుకునే నిర్ణయాలు ప్రార్దించి, దేవుడిచ్చే శాంతిని పొందాక తీసుకునేవిగా ఉండేలా జాగ్రత్తపడాలి (ఫిలిప్పీ 4:6-7).


దైవికమైన జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే, లేఖనాలలో నుండి ఈ అయిదు హెచ్చరికలు పాటించడానికి జాగ్రత్తపడాలి!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.