అపొస్తలుల కార్యములు 20:26, 27 లో పౌలు ఎఫెస్సీయులకు వీడ్కోలు ఇలా చెప్పాడు "కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషినికానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు."
ఎవరి నాశనము విషయమైనను నేను దోషినికాను అంటే అర్ధమేమిటి?
దీనికి జవాబు దేవుని వాక్యంలో నుండే యెహెఙ్కేలు గ్రంధంలో కనబడుతుంది.
దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవియ్యగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని యెడల ఆ దుర్మా ర్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణచేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువనియెడల అతడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. (యెహెజ్కేలు 33:8,9)
పాపపు జీవన శైలిలో ఎవరైనా ఉంటే ఆ విషయంలో మౌనంగా ఉండాలని, ఎవరినైనా ప్రేమించాలి, అంగీకరించాలి అని చెప్పే స్వరాలే ఎక్కువగా మన ఆధునిక క్రైస్తవ సంస్కృతిలో వింటున్నాం.
"మన పని తీర్పు తీర్చడం కాదు, మన పని ప్రేమించడం" అనే ప్రతిపాదనే ఎక్కువగా వింటున్నాం. రోమా పత్రిక ఒకటో అధ్యాయం ఏమి చెబుతుందో తెలిసి కూడా దానిని నిర్లక్ష్యం చేసి, ఈ ప్రతిపాదనే పట్టుకుంటున్నాం.
కాని మనుషులను వారి పాపాలు గురించి హెచ్చరించే పని కూడా మనకు అప్పగించినట్టు దేవుడు చెబుతున్నాడు. మనం అది చేయకపోతే, ఆయన మనల్నే దానికి బాధ్యులుగా ఎంచుతారు.
"I will hold you accountable for their blood"
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.