దేవుడు కొందరికి వేరేవారికంటే ఎక్కువగా తనను తాను కనుపరుచుకుంటాడు.. దీనికి కారణం ఆయనకు వారంటే ఎక్కువ ఇష్టం అనేమి కాదు. ఎవరి మనసులు, జీవితాలు తప్పుడు స్థితిలో ఉంటాయో, అలాంటి వారికి ఆయన కనపరుచుకోవడం అసాధ్యం. ఎలాగైతే సూర్యరశ్మికి ఎటువంటి పక్షపాతం లేకపోయినా, దాని తేజస్సు దుమ్ముపట్టిన అద్దంపై కంటే, శుభ్రంగా ఉన్న అద్దంపైనే సహజంగా ఎక్కువగా ప్రతిబంబిస్తుందో అలా అనమాట. - సి. స్. లెవైస్.
దేవుడు అంతటా ఉంటూ వెలుగును నింపేవాడు (1 యోహాను 1:5), కాని ఆయన వెలుగులో జీవించడం మనం ఎన్నుకోవాలి:
మీరు పూర్వమందు చీకటియైయుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి (ఎఫెసీయులకు 5:8-10)
దేవునితో సరైన సంబంధంలో గనుక మనం లేకపోతే మనం దుమ్ముపట్టిన అద్ధంలా ఉన్నట్టే.
"మన జీవితపు అద్దాలను ఎప్పుడైతే మెరుగుపరుచుకుంటామో" అప్పుడు ఆయన వెలుగును ప్రతిబంబించే నక్షత్రాల్లాగా మనం ప్రకాశిస్తూ, ఆయనకు మహిమను తెస్తూ, ఈ చీకటి ప్రపంచంలో ఆయన వెలుగును ఉదయింప చేయగలం.
~ ఈరోజు మన అద్దాలను మెరుగుపరుచుకుంటూ, ప్రకాశిద్దాం!
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.