51 కీర్తనలో యదార్థమైన పశ్చాత్తాపానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా దావీదుని చూస్తాము.
దావీదు ఇలా వ్యక్తపరిచాడు:
1. దేవుని కరుణ, క్షమాపణ పొందటానికి తనకి ఎటువంటి అర్హత లేదని, దానిని పొందడానికి పూర్తిగా దేవుని మీదే ఆధారపడాలని అతనికి తెలుసు. (1,2 వచనాలు)
2. తన పాపమే తనను దేవుని నుండి దూరం చేసిందని తీవ్రమైన ఆవేదన చూపాడు (3వ వచనం)
3. దేవునికి విరోధంగా చేసిన తన పాపం వలన వచ్చే శిక్షకు, దాని యొక్క పర్యవసానముకు తాను పూర్తిగా అర్హుడని అవగాహన చూపాడు (4 వ వచనం)
4. అందరు పాపం వలనే పుడతారని, అయినా దేవుడు మనతో ఉంటాడు, మనకు అందుబాటులో ఉంటాడు అనే అవగాహన చూపాడు (5-6 వచనాలు)
5. తన పాపాలు తీవ్రంగా దుఃఖకరమైనవని దేవునితో ఒప్పుకున్నాడు (7-9 వచనాలు)
6. తన మనస్సాక్షి మరియు దేవునితో సంబంధం రెండూ పునరుద్ధరణ పొందాలనే లోతైన కోరిక కలిగిన్నాడు (10-15 వచనాలు)
7. 'విరిగి నలిగిన' హృదయం తప్ప వేరే ఏ అర్పణ సరిపోదు అని అర్ధం చేసుకున్నాడు (16-17 వచనాలు)
8. దేవునితో సంబంధాన్ని దేవుడు తిరిగి మరలా కడతాడని నమ్మాడు (18-19 వచనాలు)
పాపం మరియు క్షమాపణ యొక్క స్వభావాలు తెలుసుకోవడానికి 51 వ కీర్తన ఒక గుర్తుగా ఉంది. దేవుడు మనలను క్షమించాలని, పునరుద్ధరించాలని ఎంత ఆతురతతో ఎదురుచూస్తున్నారో మనం కూడా అంతే ఆతురతతో పశ్చాతాపపడదాం!
-------------------------
అదనపు నోట్స్
(1-2) క్షమాపణను మనమెప్పుడు ఒక హక్కుగా భావించకూడదు. అది ఎప్పుడు అర్హత లేనివారికిచ్చే బహుమానమే.
(3) దేవుని శరీరమైన సంఘంలో కూడా యదార్ధమైన పశ్చాతాపం చాలా అరుదైనదే.
(4) దావీదు దేవునికి విరోధంగా పాపము చేసాను అని చెప్పింది తాను ఇతరుల పట్ల చేయలేదు అని చెప్పడానికి కాదు, కాని అతని పాపం వలన దేవుని ఆజ్ఞలు మీరాడు, దేవుని ఆజ్ఞలు మీరడం దేవునిపై అపనమ్మకంతో సమానం. దావీదు బేత్షెబాకు, ఉరియాకు, తన కుటుంబానికి మరియు దేశానికి విరోధంగా చేసిన పాపం వలన తన జీవితమే ఎంతో ప్రభావానికి గురైంది.
(5-6) పిల్లలు "మంచి" వారిలానే పుడతారని లోకం చెబుతుంది. కాని లేఖనాలు ఏం చెబుతాయంటే అందరం పుట్టుకతోనే పడిపోయినవారమని.
(7-9) హిస్సోపు పాతనిబంధనలో శుధీకరణ ఆచారాలకు, సంరక్షణకు వాడేవారు.
(10-15) ఈ సందర్బం తరువాత దావీదు అన్నింటికంటే ముఖ్యంగా దేవునితో సరైన సంబంధంలోకి రావాలని ఆశపడ్డాడు. ఇదే ఈ సందర్బం తరువాత కూడా దేవుడు అందరికన్నా దావీదును మెచ్చుకోవడానికి కారణమైంది.
(16-17) దావీదు హృదయం తన పాపాన్ని బట్టి పగిలిపోయింది, శిక్షకు అర్హుడని అతనికి తెలుసు. కొంతమందికి పాపం వలన కలిగే పరిణామాలకు వారి హృదయాలు పగిలిపోతాయి కాని వారు చేసిన పాపానికి కాదు. విరిగి నలిగిన హృదయం దేవుని దృష్టికి ఎంతో అమూల్యమైనది. యెషయా 66:2.
(18-19) దావీదు తనకు కలిగిన ఈ దుఖాన్ని, ఇతరులు దేవుని మార్గాలు అర్ధం చేసుకోవడానికి సహాయపడేలా ఉపయోగించుకున్నాడు. తన పాపాలు క్షమించబడ్డాక, తన హృదయం శుద్దీకరించబడ్డాక, మరలా దేవుణ్ణి తృప్తిగా ఆరాధించుకోవాలి అని ఆశపడ్డాడు.
8 Elements of Repentance & Restoration - Psalm 51
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.