శిష్యత్వానికి నాలుగు ఆటంకాలు

మన ఆత్మీయ ఎదుగుదలను అడ్డగించే నాలుగు వాటిని పరిశోధన వలన కనిపెట్టారు. సహాయపడే కొన్ని జవాబులు ఈరోజు వాక్యధ్యానంలో.


బర్నా వారు చేసిన లోతైన పరిశోధనలో కనుగొన్నదేంటంటే, సువార్త ధ్యేయం కలిగిన వారిగా గుర్తింపబడిన క్రైస్తవులు వారి ఆత్మీయ ఎదుగుదలకు/శిష్యత్వానికి నాలుగు అడ్డంకులు కలిగుంటున్నారని - అవి:


1. నిబద్దత: కేవలం 18% శాతమే వారి ఆత్మీయ ఎదుగుదల కోసం ఒక నిబద్దత కలిగున్నారు.


2. పశ్చాతాపం : కొద్ది మందే వారి పాపాలకు నిజంగా లోతైన పశ్చాతాపం చూపుతున్నారు.


3. కార్యాచరణ: చాలా మంది మందిరంలో వారు చేసే పనిని ఆత్మీయ లోతుగా భావించి పొరబడుతున్నారు.


4. ఆత్మీయ సమాజం: జవాబుదారి తనం కలిగిన సంబంధాల్లో కొద్ది మందే పాల్గొంటున్నారు.


ఈ నాలుగు అంశాల్లో నిన్ను నువ్వు అంచనా వేసుకోవడానికి ఎందుకని కొంత సమయం తీసుకోకూడదు.


మనం యదార్ధంగా యేసు కోసం జీవించాలి అనుకుంటే, ఇవి కలిగి ఉండటం అవసరం:


1. యేసులాగా మారడానికి  ఉద్దేశపూర్వకంగా నిబద్దత చూపాలి. ఫిలిప్పీ 2:12-13


2. యేసు యొక్క ప్రణాళికల నుండి మనలను దూరం చేసే పాపాలు ఏమిటో  గుర్తించాలి. 1 యోహాను 1:8-10


3. కేవలం సంఘంలో ఉన్న పనులలో పాల్గోవడమే కాదు, అంతకంటే ముఖ్యమైన నీ విశ్వాసంలో పరిపక్వత గురించి నువ్వు ఎక్కువ పట్టించుకోవాలి. 2 పేతురు 1:5-8


4. ఇతరులలో నీ జీవితాన్ని ఖర్చు పెట్టాలి, ఇతరులు కూడా వారి జీవితాన్ని నీలో ఖర్చు పెట్టాలి. ఎఫెస్సీ 4


ఈ అడ్డంకులను జయించడానికి నాతో కలిసి ప్రార్ధిస్తారా?


4 Obstacles to Discipleship


మన ఆత్మీయ ఎదుగుదలను అడ్డగించే నాలుగు వాటిని పరిశోధన వలన కనిపెట్టారు. సహాయపడే కొన్ని జవాబులు ఈరోజు వాక్యధ్యానంలో.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.