చాలా మంది తప్పుగా పాపఫలితాన్ని నమ్ముతారు. అంటే మనం చేసే మంచి చెడుల ప్రత్యక్ష ఫలితమే మనం అనుభవించే ఆశీర్వాదాలు లేక శ్రమలు అని.
గలతీ 6:7-8 లో ఉన్న "మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును,ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంటకోయును." అనే వచనాన్ని ఆధారం చేసుకొని ఇలా నమ్ముతారు.
విత్తడం, కోయడం అనే సత్యాల వెనుక ఉన్న సూత్రలు ఏమిటో చూద్దాం:
1. అన్ని కష్టలూ పాపంతో ముడిపడినవి కావు (యోహాను 9:2-3)
2. ఫలితాలు వెంటనే రావు. ఎలాగైతే విత్తనాలు జల్లినప్పుడు, అవి వేరు పారి, పెరగడానికి సమయం తీసుకుంటుందో, అలానే మంచి, చెడు ఫలితాలు విత్తిన చాలా సంవత్సరాలకు గాని రావు (1 కొరింధీ 4:5).
3. కొన్ని మంచి విత్తనాలకు కొన్నిసార్లు ఈ భూమిపై కష్టాలు అనే పంట కొయొచ్చు, కాని పరలోకంలో మాత్రం గొప్ప ప్రతిఫలం ఉంటుంది (మత్తయి 5:11-12; 2 థెస్స 1:6-10).
4. కొన్ని చెడు విత్తనాలు కొన్నిసార్లు ఈ భూమిపై మంచి అనే పంట కొయొచ్చు, కాని అది శాశ్వతమైన శిక్ష తెస్తుంది (మత్తయి 16:26).
ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు, ఎక్కడైనా దేవుని ఆజ్ఞలు మీరామా అని మన జీవితాలను పరీక్షించుకొని, పశ్చాతాపపడాలి (హెబ్రీ 12:6). అలాంటిది ఏమీ లేదు అని తెలుసుకున్నప్పుడు, కొన్నిసార్లు మంచికి నిత్యత్వంలోనే ప్రతిఫలం ఉంటుందనే కోణంలో ఆలోచించాలి.
A Common Misunderstanding about Consequences
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.