యిర్మీయా 29:11 సమస్యల మధ్యలో నిరీక్షణనిచ్చే సందేశం, అంతేకాని అది సమస్యలే లేని జీవితాన్ని ఇస్తానన్న వాగ్దానం కాదు..
ఈ మాటను నా భర్త పనిచేస్తున్న ఆఫీస్ గోడపై నేను తగిలించాను. అప్పుడు ఆయన కొలంబియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో వృత్తి గురించి ప్లానింగ్ మరియు అందులో స్థిరపడటం నేర్పించే పని చేసేవారు.
నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు. (యిర్మీయా 29:11)
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బైబిల్ కాలేజీలో ఉన్న సెమినరీ గ్రాడ్యుయేట్స్ కు ఇది సరిగ్గా సరిపోయే వాక్యం. కాని అందరూ దీనిని అర్ధం చేసుకోవలసిన విధంగా అర్ధం చేసుకోలేకపోయారు.
దీని నిజమైన అసలైన అర్ధం వెదకకుండా, ముక్కలు ముక్కలుగా దేవుని వాక్యాన్ని అర్ధం చేసుకునే క్రైస్తవుల వల్ల కలిగే నష్టమిది.
యిర్మీయా 29 అసలు బబులోనుకు చెరకు వెళ్ళిపోయిన యూదులను ఉద్దేశించి, ఈ చెరను ఉత్తమమైన రీతిలో ఉపయోగించుకోవాలి, ఎందుకంటే దీనిని అనుమతించడానికి వెనకాల దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉంది అన్న సందేశం. ఈ చెర 70 ఏళ్ళ వరకు సాగింది, చాలా మంది దీని ముగింపును చూడలేకపోయారు.
దేవుని ప్రణాళికలు మనపై ఎప్పుడు మంచివే.. అయినంతమాత్రానా, అవి సులభమైనవేమి కాదు, మరియు మనిషి యొక్క పరిమితమైన ఆలోచనా శక్తితో ఆ ప్రణాళికలను ఎన్నుకోలేము.
నీ పరిస్థితులు నువ్వు ఆశించిన రీతిలో లేవా? అయినా వాటిని ఉత్తమమైన రీతిలో ఉపయోగించుకో. నీ జీవిత కాలంలో వాటి ఫలితాలను చూడగలిగినా, చూడలేకపోయినా, దేవునికి మాత్రం నీ పట్ల మంచి ప్రణాళిక మాత్రమే ఉంది (రోమా 8:28). ఈ వాక్యం నీ హృదయం అనే గోడపై వ్రాసుకో!
Jeremiah 29:11 - Misused and Misunderstood
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.