"విజయంతో నువ్వు వాదించలేవు"
ఈ మాట చాలా జనాదరణ పొందినదే అయినా ఇది కొన్నిసార్లు నిజం, కొన్నిసార్లు నిజం కాదు.
విజయంతో వాదించవచ్చు. అది ఎప్పుడంటే దానిలో తప్పుడు ఉద్దేశాలు, అనైతికమైన ఆచారాలు, సరికాని విలువలు ఉన్నప్పుడు.
కాని విజయం దైవికమైన విలువలతో వచ్చినదైతే, అది వేరే సంగతి.
కాని దేవుడు మనకు ఏదైనా చేయమని చెబితే, అది మనం నిష్కపటమైన హృదయంతో శక్తి లోపం లేకుండా చేసినా, అది చూడటానికి మాత్రం మనం ఓడిపోయాము అన్నట్టుగా ఉన్నా, మనం నిజంగా ఓడిపోయినట్టు కాదు.
దీనిని వివరిస్తాను: ప్రవక్త అయిన యిర్మీయా దేవునికి ఎంతో విశ్వాస్యత చూపిన వ్యక్తి, తన జీవితంపై దేవుని ఉద్దేశాలు విజయవంతంగా నెరవేర్చిన వ్యక్తి. కాని ఇతరులు అతనిని ధ్రువీకరించి, నమ్మిన అనుభవాలకంటే, అతనిని నిర్లక్ష్యం చేసి, తృణీకరించిన అనుభవాలే ఎక్కువ.
ఉదాహరణకు: యిర్మీయ ఏడవ అధ్యాయంలో, ప్రజలకు నా తరుపున బలమైన గద్దింపుతో కూడిన హెచ్చరికలు ఇవ్వాలి, కాని "నువ్వు ఎంత చెప్పినా కూడా వారు వినరు" అని దేవుడు చెప్పారు.
ఇలాంటి మాటే యెహెఙ్కేలు 2:8 లో కుడా చూస్తాం.. ఏమిటంటే దేవుడు యెహెఙ్కేలుతో చెప్తారు "వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము" అని.
విజయం అనేది వచ్చే ఫలితాల మీద ఆధారపడి ఉండదు కాని మనం చూపే విశ్వాస్యత మీద ఆధారపడి ఉంటుంది: అదెలా అంటే
1. మొదటగా ఆయన రాజ్యాన్ని వెదకడం వలన (మత్తయి 6:33).
2. దేవుని మార్గాలకు అనుగుణంగా మారుతూ, ఆయనకు ఏది సంతోషాన్నిస్తుందో అర్ధం చేసుకోవడం వలన (రోమా 12:2).
3. హింస, అవమానం, తిరస్కారం వంటివి పొందాల్సి వచ్చినా, ఎక్కడా రాజీపడిపోకుండా ఆయన సత్యాన్నే ప్రకటించడం వలన (మత్తయి 5:10-12).
అప్పుడు, మనుషులు మనలను అపజయం పొందినవారు అని పిలిచినా పరవాలేదు గాని, దేవుడు మాత్రం మనలను విశ్వాస్యత గలవారుగా పిలుస్తారు.
You Can't Argue with Success, or Can You?
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.