సిద్దపడుదాం: బైబిల్ లో ఉన్న 'అసమానతల' సంగతేంటి?

 

ప్రశ్నకు క్లుప్తంగా, వాక్యానుసారమైన జవాబు: బైబిల్లో 'అసమానతలు' లేవా?

ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి సిద్దపడుదాం:


• బైబిల్లో 'అసమానతలు' ఉన్నాయా?


ఇది చాలా తరుచుగా వినబడే ఆరోపణ, కాని ఇది పూర్తిగా నిరాధారమైనది. ఈ ప్రశ్న అడిగే వారు అసలు ఎటువంటి ఉదాహరణలు చూపించలేరు. అందులో కొందరు ఇటువంటి ప్రశ్నలు అడగడానికి కారణం వాక్యం చదివిన మొదటి చూపులో వారికి కొంత వైరుధ్యంగా అనిపించడమే.


ఉదాహరణకు: సువార్తల్లో ఉన్న కొన్ని వైరుధ్యాలు గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు తెలుసుకున్నది ఏమిటంటే, దైవవేశం వలన సువార్తలను వ్రాసిన రచయితలు ఒకే నిజమైన కథను వేరు వేరు కోణాల్లో వ్రాసారు అనేది రుజువు కావడమే వైరుధ్యాల ఉద్దేశం. వైరుధ్యాలు అసమానతలు ఒకటే కాదు.


నిజాయితీపరులైన నలుగురిని వారు చూసిన ఏదైనా జరిగిన సంఘటనను వివరించమంటే, ఒకరు అందులో హాజరైన అందరి పేర్లు చెబితే, ఇంకొకరు ముఖ్యమైన వారి పేర్లు చెప్తారు. ఆ సంఘటనను చూసిన ఒకొక్కరు ఒకొక్క అంశంపై దృష్టిపెడతారు. ఇవి అసమానతలు కావు గాని వేరు వేరు దృక్పధాలు. దేవుడు వేరు వేరు దృక్పధాలు ఉండటం మనకు ఉపయోగకరం అనుకున్నారు లేదంటే లేఖనాల్లో అవి అనుమతించేవారు కాదు!


నలభై ఏళ్ళ కంటే ఎక్కువే బైబిల్ విద్యార్దిగా ఉన్న తరువాత నేను చెప్పగలను : "దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే" (సామెతలు 30:5) అని.


గనుక ఎవరైనా లేఖనాలలో ఒక ప్రత్యేకమైన 'అసమానత' గురించి నిన్ను అడిగితే జవాబు చెప్పడానికి ఎన్నో వనరులు మనకి అందుబాటులో ఉన్నాయని మర్చిపోవద్దు (ఉదా: అపోలోజెటిక్స్ ప్రెస్)


కాని అవి రీసెర్చ్ చేసే ముందు అసలు ప్రశ్న అడిగిన వ్యక్తి నిజాయితీగా అడుగుతున్నారా లేదా అనేది తెలుసుకోవాలి. వారు అడిగినది అసమానత కాదు అని నేను నిరూపించితే మరి లేఖనాలను నమ్ముతావా అని ముందే అడగాలి.


అయినా 'నమ్మను' అని వారు చెబితే ఇంక నీ సమయాన్ని వృధా చేసుకోకు. వారు కేవలం వాదించడానికే ప్రయత్నిస్తున్నారు కాని నువ్వు ఎంత రుజువు చూపించినా వారిని ఒప్పించలేవు.


Be Prepared: What about Bible "Inconsistencies"?


ప్రశ్నకు క్లుప్తంగా, వాక్యానుసారమైన జవాబు: బైబిల్లో 'అసమానతలు' లేవా?


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.