"మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు"

మీ జీవిత భాగస్వామికి వారు మీకు ఆకర్షణీయంగా ఉన్నారు అని తెలియడం చాలా ముఖ్యం. ఈ చిన్న వాక్యధ్యానంలో దీని వివరణ చూద్దాం!


కాన్ఫరెన్స్ మధ్యలో విరామ సమయం వచ్చినప్పుడు, లేడీస్ రూమ్ లోకి వచ్చాను.. అక్కడ సింక్ దగ్గర పరిచయం ఉన్న ఒకామె కనబడింది.


ఆమె "మీ భర్త అద్భుతంగా కనిపిస్తున్నారు" అని నన్ను ఆశ్చర్యానికి గురిచేసే మాట నాతో అన్నది.


ఆమె అన్న ఆ మాట నాకు చాలా వింతగా అనిపించింది. ఆమె అలా అనడం తగినది కాదు అనిపించింది. కాని వెంటనే ఒక ఆలోచన నా మనసులో మెదిలింది అదేమిటంటే: అసలు నేనెప్పుడు నా భర్తను మీరు బాగున్నారు, ఆకర్షణీయంగా ఉన్నారు అని చెప్పాను? ఒక వారం క్రితమా లేక నెల క్రితమా?


నా భర్త అయితే నేను అందంగా ఉన్నానని నాకు అనిపించేలా చేయడంలో గొప్పవారు. గత పదేళ్లలో నేను ఒక సర్జరీ వలన ఉబ్బిపోయినట్టు అయిపోయాను, జుట్టు బాగా రాలిపోయింది, నా ముఖం మీద కాలిపోయిన పెద్ద మచ్చ ఏర్పడింది, నేను 60 ఏళ్ళ వ్యక్తిని గనుక ఇంక నా ముఖం పై ఎన్నో ముడతలు. అయినా సరే నేను ఆకర్షణీయంగా ఉన్నానని ఎప్పుడూ చెప్తుంటారు. (నాకు తెలుసు ప్రేమ గుడ్డిదని, కాని ఆయన పొగడ్తలకు నేను ఆనందపడతాను, పొగిడినందుకు మెచ్చుకుంటాను).


కాని ఆయన రూపాన్ని నేను పొగడటమంటే చాలా అరుదు. ఆయన పురుషుడు గనుక ఆయనకు అవి పెద్దగా అవసరం ఉండవులే అనుకోవడం వల్లేమో.


ఆయన ఎలాగైనా నాకే సొంతం కదా అని నేను అనుకోవడం వలన కాబోలు.


కాని ఈ స్త్రీ బాత్రూం లో చెప్పిన ఆ మాటతో పాటు ఇంక అనేకమైన కారణాలు నన్ను ఈ అంశాన్ని ఎక్కువ ఆలోచించేలా చేశాయి. నన్ను పొగిడితే నేనెంత ఆనందిస్తానో, ఆయన కూడా అంతే ఆనందిస్తారు అనేది నేను మొదటిసారి కనిపెట్టాను.


నీ భర్త రూపాన్ని నువ్వు పొగిడి ఎంత కాలం అయింది?


ఆయన రూపం పై ఆసక్తిని నువ్వు పూర్తిగా పోగొట్టుకుంటే, తిరిగి ఇవ్వమని దేవుణ్ణి అడుగు.


"యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి." (ఫిలిప్పీ 4:8)


అవి మీ భర్తతో పంచుకోండి.


"You Look Great!"


మీ జీవిత భాగస్వామికి వారు మీకు ఆకర్షణీయంగా ఉన్నారు అని తెలియడం చాలా ముఖ్యం. ఈ చిన్న వాక్యధ్యానంలో దీని వివరణ చూద్దాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.