యిర్మీయా హృదయంలో ఉన్న అదే 'అగ్ని' నీలో కూడా ఉందా?

యిర్మీయా హృదయంలో ఉన్న అదే 'అగ్ని' నీలో కూడా ఉందా? ఈరోజు వాక్యధ్యానం దానిని వెలిగిస్తుంది!
యిర్మీయాని ప్రకటించమని దేవుడు కొన్ని కఠినమైన సత్యాలను ఇచ్చాడు, అప్పుడు యిర్మీయా ఏమన్నాడంటే :


ఏలయనగా నేను పలుకునప్పుడెల్ల బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని యెలుగెత్తి చాటింపవలసి వచ్చెను; దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేననుకొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికియున్నాను, చెప్పక మానలేదు. (యిర్మీయా 20:8,9)


నువ్వు ఇలాంటి "అగ్నిని" ఎప్పుడైనా అనుభవించావా?


• ఎవరైనా దేవుని దగ్గరకు అనేక మార్గాలు ఉన్నాయని గట్టిగా వాదిస్తే, రక్షణకు ఒకే ఒక మార్గం యేసు ద్వారా మాత్రమే అని చెప్పాలనే బలవంతాన్ని నువ్వు అనుభవిస్తావా? (1 యోహాను 5:10-12)?


• ఎవరైనా లైంగిక సాన్నిహిత్యానికి ఎటువంటి నియమాలు లేవని గట్టిగా వాదిస్తే, దేవుడు దీనిని కేవలం వివాహం చేసుకున్న స్త్రీ పురుషుల మధ్యలో మాత్రమే ఉండాలని సృష్టించి ఉద్దేశించాడని, అలా కాదని ఇతర సంబంధాలు పెట్టుకుంటే అది మన ఆత్మలను నాశనానికి నడిపిస్తుందని చెప్పాలనే బలవంతాన్ని నువ్వు అనుభవిస్తావా? (1 కొరింధీ 6:9-10)?


• ఎవరైనా యేసు ఎప్పుడు మనుషుల పాపాలు గురించి ప్రస్థావించలేదని వాదిస్తే, దానిని సరిదిద్దాలనే బలవంతాన్ని నువ్వు అనుభవిస్తావా? (మత్తయి 4:17; యోహాను 7:7)


ఇలా చెప్పడం వలన మనకేమీ పేరు ప్రాఖ్యాతలు కాని జనాదరణ కాని రావు (యోహాను 15:18-19). కాని అది మనం మౌనంగా ఉండటానికి కారణం కాకూడదు. ఎందుకంటే రోజుకు అనేకమంది మరణం వైపు వేగంగా ప్రయాణిస్తున్నారు కాబట్టి. అందుకే మనం తప్పకుండ క్రీస్తును గురించిన సువార్తను ప్రకటించాలి.


దేవుని మాట నా హృదయంలో "అగ్నివలె" మండుచు ఉన్నది; చెప్పక మానలేదని యిర్మీయా చెబుతున్నాడు. మనం కూడా ఇలానే చెప్పగలమా?


~ నా సొంత కీర్తి కంటే దేవుని కీర్తిని గురించిన చింతే నా హృదయంలో కలిగి ఉండాలని నేనెప్పుడూ ప్రార్ధిస్తాను!


Do You Have the Same Fire in Your Heart that Jeremiah Had?


యిర్మీయా హృదయంలో ఉన్న అదే 'అగ్ని' నీలో కూడా ఉందా? ఈరోజు వాక్యధ్యానం దానిని వెలిగిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.