ఆమెకు ఏం చెప్పాలో తెలీలేదు

స్నేహితురాలు బాధపడుతున్నప్పుడు ఏం చెప్పాలో మనకు తెలీదు. కాని దీనికి జవాబును వాక్యభాగంలో నుండి ఈరోజు నేర్చుకుందాం!


నేను చాలా కఠినమైన సమయంలో ఉన్నప్పుడు, నాకు అత్యంత సన్నిహితమైన స్నేహితురాలు నా ఇమెయిల్స్ కు జవాబు ఇవ్వడం మానేసింది. చాలా సంవత్సరాల తరువాత ఆమెను ఎందుకలా చేసావని అడిగాను.


"నాకేం చెప్పాలో తెలీలేదు" అంటూ, "నా దగ్గర నీకు చెప్పడానికి జవాబులు లేవు" అని చెప్పింది.


ఈ స్నేహితురాలు లాగానే, కష్టంలో ఉన్నవారికి చేయగలిగిన సహాయం సలహాలు ఇవ్వడమే అనుకునేదాన్ని.


కాని ఎప్పుడైతే నా సొంత కష్టాలగుండా నేను వెళ్లానో నాకు అర్ధమైంది ఏమిటంటే, మనం ఇతరులకు ఇచ్చే గొప్ప సలహా ఏమిటంటే, 'అసలు సలహాలు ఇవ్వకపోవడమే' అని.


ఏ స్నేహితులైతే 'నాకు బాధగా ఉంది, నీ కోసం ప్రార్ధిస్తాను' అని చెప్తారో, అదే అన్నింటికన్నా గొప్ప ఆదరణ, గొప్ప సహాయం. వాళ్ళ యదార్థమైన ప్రార్ధనలు, ఎప్పుడు నిరాశపరచని, నిరంతరం అందుబాటులో ఉండే, మనకు ఏమి చెప్పాలో సరిగ్గా తెలిసిన మన ఒకేఒక నిజస్నేహితుడైన దేవుని జవాబును పొందుకోవడానికి సహాయపడతాయి.


..దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. (2 కొరింథీయులకు 1:3,4)


ఏ స్నేహితురాలైనా సమస్యలతో బాధపడుతుంటే, దేవుడు ఏదైనా స్పష్టమైన నడిపింపు ఇస్తే తప్ప, దయచేసి ఎటువంటి సలహాలు లేక జవాబులు ఇవ్వకండి. కాని నువ్వు ఆమె సమస్యను విన్నావని, నిజంగా ఆమె గురించి చింతిస్తున్నావని తెలియచేయి (రో్మీయులకు 12:15), అంతే కాకుండా దేవుడు ఆమెకు సరైన జవాబునివ్వాలని తప్పక ప్రార్ధించు.


She Didn't Know What To Say


స్నేహితురాలు బాధపడుతున్నప్పుడు ఏం చెప్పాలో మనకు తెలీదు. కాని దీనికి జవాబును వాక్యభాగంలో నుండి ఈరోజు నేర్చుకుందాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.