ప్రపంచంలో, కుటుంబంలో, మన హృదయాల్లో, మనస్సులో ఉన్న సమస్యలైనా 10వ వచనం మరి ముఖ్యంగా చాలా ఆదరణ ఇస్తుంది. "ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును భూమిమీద నేను మహోన్నతుడనగుదును".
జనాల గుంపులో తప్పిపోయిన చిన్న బిడ్డ గురించి ఆలోచించు. ఆమె కళ్ళలో నీళ్ళు, హృదయం లో భయం నిండిపోయింది. కాని పైకి చూసేసరికి తండ్రి కనపడ్డాడు, అప్పుడు ఆమెకు అర్ధమైంది తన తండ్రి తనతోనే ఉన్నాడు, తనను వదిలి వెళ్ళిపోలేదు అని. అప్పుడు ఆ తండ్రి తన చేతులతో ఆ బిడ్డను ఎత్తుకొని, కౌగిలించుకొని, ఈ విధంగా చెప్తాడు "ఊరుకో, నేనిక్కడే ఉన్నాను. నేను నిన్ను చూస్తూనే ఉన్నాను, ఏదీ కుడా మనలను విడదీయలేదు. అంతా నా ఆధీనంలోనే ఉంది" అని.
అదేవిదంగా, మనం కుడా "పైకి" చూసి, తండ్రి చేతుల్లోకి వెళ్లి, ఆయన మనలను మర్చిపోలేదు, అంతా ఆయన ఆధీనంలోనే ఉంది అని గుర్తు చేసుకొని, మన భయాలనుండి విడుదల పొందొచ్చు.
నువ్వు కుడా దేని గురించైనా ఇబ్బంది పడుతున్నావా? దుఃఖంతో ఉన్నావా? అయోమయంలో ఉన్నావా? లేక ఒంటరితనంతో ఉన్నావా? ఊరకుండి దేవుణ్ణి తెలుసుకో!
The Comfort of Being Still and Knowing He is God
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.