2 కొరింధీయులకు 11:3 నాకెంతో ఇష్టమైన వచనం:
సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. (2 కొరింథీయులకు 11:3)
సరళత అర్ధం చాలా సులభముగా, స్పష్టంగా గ్రహింపగలం: అదేమిటంటే, క్రీస్తు పై ఉన్న భక్తి మన సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడం కోసం కాదు. అది నిజమైన, స్వచ్ఛమైన, సులభమైన, స్పష్టమైన, హృదయపూర్వకమైన, దేవునిపై పూర్తి ఏకాగ్రత, విధేయత చూపే భక్తి.
ప్రస్తుత ప్రపంచంలో క్రైస్తవులు, విశ్వాసాన్ని చాలా జటిలమైనదిగా చేసేస్తున్నారు. అవ్వను ఏవిధంగా ఆ 'పురాతన సర్పం' తన ఉచ్చులో పడేసిందో అలా పడేస్తున్న రోజుల్లో, ఈ వాక్యం మనకెంతో ఆదరణ, ప్రోత్సాహం ఇస్తుంది!
విషాదం ఏమిటంటే, చాలా మంది వాక్యానుసారంగా లేని వేరే సువార్తను, వేరే యేసును నమ్ముతున్నారు (2 కొరింధీ 11:4), ఎందుకంటే అది వారికి ఇంపుగా ఉంది గనుక.
క్రైస్తవులం అని చెప్పుకునే వారికి సరళతకు మించి ఇంకా ఏదో కావాలి. వారికి సూచనలు, అద్భుతాలు, ప్రత్యేకమైన అనుభవాలు, దేవదూతలను కలుసుకోవడం, భావొద్వేగాల్లో ఉద్రేకం, మానవాతీతమైన అనుభవాలు వంటివి కావాలి. కొందరైతే 'దేవుని వాక్యాన్ని' అశ్రద్ధ చేస్తారు, కాని ప్రవక్తలు అని చెప్పుకునే వారి 'మాటల' కోసం ఆత్రుత చూపుతారు.
ఇంకొందరు ఈ భూమిపై ఆరోగ్యం, ధనం, విజయం సాధించడమే బైబిల్ ఇచ్చిన వాగ్దానాలు అనుకోని వాటి పై దృష్టి పెడతారు.
నిజానికి మనలను క్రీస్తులో సరళత నుండి దూరపరిచడానికి ఇవన్నీ మన దృష్టిని మళ్ళించేవే. దీని ఫలితం ఏమిటంటే, దేవునితో మన సంబంధం కుడా ఆదాము అవ్వల్లాగే కలుషితం అయిపోవడమే.
ఒక క్రైస్తవునికి ఉండవలసిన ధ్యేయం చాలా సరళమైనది: అది మన ప్రభువును సంతోషపెట్టే పవిత్రమైన జీవితం జీవించడమే.
అటువంటి సరళతలో జీవిద్దామా!


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.