"అసూయ అనేది ఇతరులను ఇబ్బందికి గురిచేస్తుంది, కాని ఎవరికైతే అది ఉంటుందో అది వారిని హింసకు గురిచేస్తుంది" - విలియం పెన్
అసూయ మరియు మత్సరం స్నేహాన్ని నాశనం చేయడం ఎప్పుడైనా చూసావా? నేను చూసాను.
అవి ఆ వ్యక్తిని తీర్పు తీర్చే వారిగా, మర్యాద లేనివారిగా, విమర్శించే వారిగా, స్వార్ధపరులుగా మార్చేస్తుంది. స్నేహానికి ఒక అంతం తీసుకొస్తుంది. ఎవరైతే అసూయతో ఉంటారో, వారు మంచి స్నేహితులను పోగొట్టుకుంటారు, నెమ్మదిగా వారి హృదయంలో ఉన్న చేదును, స్వార్ధాన్ని గుర్తించే సామర్ధ్యన్ని కోల్పోతారు, అది వారి జీవితంలో ఉన్న అన్ని అంశాలను చెడుగా ప్రభావితం చేస్తుంది.
అందుకే అసూయా మరియు మత్సరం కొంచెంగా ఉన్నప్పుడే వాటిని గుర్తించడం చాలా ముఖ్యం లేదంటే అవి మన హృదయంలో బలమైన స్థానాన్ని తీసుకునే ప్రమాదం ఉంది. నువ్వు ఇతరుల ఆదాయాన్ని, వివాహాన్ని, సేవను, హోదాను, పలుకుబడిని, ఉద్యోగాన్ని, పై రూపాన్ని మొదలైనవాటిని చూసి ఆశపడుతున్నావా? మన కంటే ఇతరులు ఎక్కువ గొప్పవాళ్ళైపోతున్నారు లేక ధనవంతులైపోతున్నారు లేక ప్రభావితులైపోతున్నారు అనే భయం మనలో ఉందా?
అలాగైతే, మనం ఇవి చేయాల్సిన అవసరం ఉంది:
1. దేవుని క్షమించమని అడగాలి (1 యోహాను 1:8-10).
2. తృప్తి కలిగి ఉండటం కోసం ప్రార్ధించాలి (ఫిలిప్పీ 4:12-13).
3. ఎవరినైనా మనం బాధపెడితే క్షమించమని అడగాలి (యాకోబు 5:16).
ఎక్కువ అసూయతో ఉన్నవారు ఇవి చేయలేరు. వారు అసూయ మరియు మత్సరం అనే భూతములు వారి సంబంధాలను, దృక్పదాన్ని నాశనం చేయడానికి అనుమతిస్తారు. ఆ నాశనం మన వరకు రాకుండా జాగ్రత్త పడదాం!
ఒకవేళ ఈ అసూయ మరియు మత్సరాలను జయించడానికి నీకు చాలా కష్టంగా ఉంటే ఈ క్రింది వచనాలను చదివి, ధ్యానించి, కంఠస్తం చెయ్యి:
• సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు. (సామెతలు 14:30)
• మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీరసంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా? (1 కొరింథీయులకు 3:3)
• ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; (1 కొరింథీయులకు 13:4)
• అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును. (యాకోబు 3:14-16)
------------------
కొందరు అసూయ అంటే నీకున్నదాన్ని పోగొట్టుకుంటావేమో అనే భయం అని, మత్సరం అంటే నీకు లేనిది కావాలని ఆశించడమని అంటారు.
కాని ఈ రెంటిని పర్యాయపదాలుగా చరిత్రలో, బైబిల్లో వాడటం చూస్తాం. నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో నాకు అర్ధమైందేంటంటే అసూయ అనేది మత్సరం యొక్క కోపరూపమని.
ఎవరైతే అసూయ, మత్సరం రెంటికి తేడా ఉంది అని అంటారో, ఈ వాక్యాధ్యానం ఈ రెంటి గురించి స్పష్టంగా వివరించడం గమనించగలరు.
The Destroying Monsters of Jealousy and Envy


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.