క్రీస్తు ఇక్కడ ఇప్పుడు ఆరోగ్యాన్ని, ధనాన్ని, ఇహలోక ఆనందాలను వాగ్దానంగా ఇచ్చారు అని ఎవరైనా ప్రకటిస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
ఎందుకంటే అది "వాక్యానుసారం" కాదు.
మనం 'రూపాంతరం' పొందే ప్రక్రియలో ఉన్నామని స్పష్టంగా బైబిల్ చెబుతుంది.
"సంపూర్ణత" భవిష్యత్తు గురించి ఇచ్చిన వాగ్దానం (హెబ్రీ 2:5-9; 1 కొరింధీ 15:20-28).
దేవుడు ఇహలోక ఆరోగ్యం, ఆనందం గనుక వాగ్దానం చేస్తే, తిమోతి కడుపులో సమస్యలతో శ్రమపడేవారు కాదు (1 తిమోతి 5:23), పౌలు అసలు ఏ ఆకలిలో, అవసరంలో ఉండే వారు కాదు (ఫిలిప్పీ 4:12-13).
దేవుడు ఇహలోకంలో ఎటువంటి శ్రమలు లేని పరిస్థితి గనుక వాగ్దానం చేస్తే, దేవుని ప్రేమించే క్రైస్తవులలో ఇదొక కట్టుబాటుగా ఉండేది. కాని అలా లేదు.
దేవుడు స్వస్థపరచగలరు, పరుస్తారు కూడా, విడుదలలు ఇవ్వగలరు. అలాంటి వారి జీవిత కథలు స్ఫూర్తినిస్తాయి.
కాని అనారోగ్యంలో, హింసల్లో, కష్టాల్లో ఉంటూ కూడా ఎవరైతే దేవునిపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటారో, అలాంటి వారి జీవిత కథలు కూడా మనకు చాలా అవసరం.
ఇహలోక శ్రమల నుండి దేవుడు మనలను విడిపిస్తే, ఆయన ఆదరణలో ఉన్న లోతు మనం ఎప్పటికీ అర్ధం చేసుకోలేము, అది అర్ధం చేసుకోలేనప్పుడు, ఇతరులను తగినంతగా ఆదరించలేము కూడా (2 కొరింధీ 1:3-7).


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.