నేటి రోజుల్లో ఆధునిక వినోదం ఎక్కువగా అస్లీలత విషయంలో మొగ్గుచూపడం లాగా కనిపిస్తుంది.
నగ్నత, అసభ్యత లేకపోయినా, చాలా పుస్తకాలు, టీవి షో లు, సినిమాలు - దేవుడు వివాహం గురించి కలిగి ఉన్న ప్రణాళికలను వెక్కిరించడం, హింసను ప్రోత్సాహించడం, దైవ విరుద్ధమైన విలువలను ప్రచారం చేయడం వంటివి చేస్తుంటాయి. వీటిని చదవడానికి లేక చూడటానికి ఎన్నో గంటలు మనం వెచ్చిస్తే, మన మనస్సాక్షిని మనం బలహీనపరుస్తాం, మన సమయాన్ని వృధా చేసుకుంటాం, నమ్మకాలలో రాజీపడిపోతాం, సాక్షాన్ని నాశనం చేసుకుంటాం.
ఎప్పుడైతే ఒక స్త్రీ అస్లీలమైన వాటిని చూసి వారే దుర్వినియోగించబడటం అనే దానిని బట్టి ఆనందిస్తే, అది నైతికంగా కుళ్ళిపోవడానికి ఒక సూచన. అది చాలా తీవ్రమైన విషయమని గమనించాలి. ఎప్పుడైతే క్రైస్తవులు విశ్రాంతి తీసుకోవడానికి తమ విలువలను పక్కన పెట్టి దైవికం కాని సినిమాలను, టీవి షో లను చూస్తారో, ఈ విషయం కూడా పై చెప్పిన దానితో సమానమే, ఇదీ అంతే తీవ్రమైనదని గమనించాలి.
మత్తయి 5:13-16 మనం లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు అని గుర్తుచేస్తుంది. మనం గనుక మన ఉప్పు సారాన్ని కోల్పోతే లేక మన వెలుగును దాచేస్తే, దేవుణ్ణి మహిమ పరచడంలో ఓడిపోయినవాళ్ళమే, ఇతరులను రక్షించే ఆయన కృపకు వారిని నడిపించడంలో కూడా ఓడిపోయినవాళ్ళమే.
మన టీవిలు ఉండే గోడపై ఈ క్రింది వాక్యాన్ని ఒక హెచ్చరికగా తగిలించుకోవడంలో తప్పు లేదు:
మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.... గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి. (ఎఫెసీయులకు 5:8-11)
గనుక ఈరోజు కొంత సమయం తీసుకోని, దేవుని సువార్త నిమిత్తం మనం వినోదం పొందే వాటి ప్రమాణాలు ఎలాంటివో ఒక అంచనా వేసుకుందాం!
Soft-Core Christians—Biblical Entertainment Standards


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.